చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్‌మీ (Realme) తన రియల్ మీ పీ1 5జీ (Realme P1 5G) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో సోమవారం విడుదల చేసింది.రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ (MediaTek Dimensity 7050 SoC), రియల్‌మీ పీ1ప్రో 5జీ (Realme P1 Pro 5G) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 (Qualcomm Snapdragon 6 Gen 1) చిప్ సెట్‌తో వస్తున్నాయి. రెండు ఫోన్లూ 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తాయి. ఈ రెండు ఫోన్లతోపాటు రియల్‌మీ తన రియల్‌మీ పాడ్ 2 వై-ఫై వేరియంట్, రియల్‌మీ బడ్స్ టీ110 లను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లు గ్లోసీ, స్పార్క్లింగ్ ఫోనిక్స్ డిజైన్లతో వచ్చాయి.
రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999లకు లభిస్తాయి. పీకాక్ గ్రీన్, ఫోనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఈ నెల 22 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. రియల్‌మీ పీ1ప్రో 5జీ (Realme P1 Pro 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తాయి. ప్యారట్ బ్లూ, ఫోనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఫోన్లు అందుబాటులో ఉంటాయి. మోటో నుంచి రూ. 15 వేలకే 5 జీ ఫోన్, రెండు వేరియంట్లలో జీ64ను విడుదల చేసిన మొబైల్ తయారీ దిగ్గజం
ఈ నెల 22 సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెడ్ లిమిటెడ్ సేల్ నిర్వహిస్తారు. ఈ నెల 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. రియల్ మీ పీ1 5జీ సిరీస్ ఫోన్లతోపాటు రియల్ మీ బడ్స్ టీ110, రియల్ మీ పాడ్ వై-ఫై వర్షన్.. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఇండియా వెబ్ సైట్లలో లభిస్తాయి. ఈ నెల 19 నుంచి సేల్స్ ప్రారంభం అవుతుంది.
రియల్ మీ పీ1 5జీ ఫోన్ ఫీచర్లు
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు,
240 టచ్ శాంప్లింగ్ రేటు
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్) అమోలెడ్ డిస్ ప్లే
2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
రెయిన్ వాటర్ టచ్ ఫీచర్
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 ఓఎస్ వర్షన్
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్,
2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా,
సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా
45 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
రియల్‌మీ పీ1 ప్రో 5జీ స్పెషిఫికేషన్స్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్
8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ
6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ కర్వ్‌డ్ ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్,
950 నిట్స్ పీక్ బ్రైట్ నెస్,
93 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో,
2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్,
రెయిన్ వాటర్ టచ్ ఫీచర్
50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)
లైట్ ఫుషన్, ఆల్ట్రా హెచ్డీఆర్, నైట్ ఐ
8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్
16-మెగా పిక్సెల్స్ సెన్సర్ సెల్ఫీ కెమెరా