Redmi 9 Prime: రూ. 9,999లకే నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి 9 ప్రైమ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన షియోమి, ఆగస్టు 6వ తేదీన ఫస్ట్ సేల్
రెడ్‌మి 9 ప్రైమ్ (Redmi, Redmi 9) పేరుతో రెండు వేరియంట్లలో భారత మార్కెట్లలో మంగళవారం సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇది ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రంగుల్లో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ (Redmi 9 Prime India) లభ్యమవుతోంది. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో (Redmi India smartphone) తొలిసారి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్‌మి 9 ప్రైమ్ (Redmi, Redmi 9) పేరుతో రెండు వేరియంట్లలో భారత మార్కెట్లలో మంగళవారం సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇది ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రంగుల్లో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ (Redmi 9 Prime India) లభ్యమవుతోంది. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో (Redmi India smartphone) తొలిసారి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ విడుదల, సింగిల్ టేక్ కెమెరా ప్రధాన ఆకర్షణ, 6జీబీ ర్యామ్..128జీబీ స్టోరేజ్ ధర రూ.19,499, ఫీచర్లపై ఓ లుక్కేయండి
ధరల (Redmi 9 Prime Price) విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ : 11999 రూపాయలుగా ఉంది. 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ : 9999 రూపాయలుగా ఉంది. రెడ్‌మీ 9 ప్రైమ్ ఫీచర్లు విషయానికి వస్తే.. 6.53 అంగుళాల డిస్ ప్లే, 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 10, మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13+8+5+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
Here's redmi 9 prime Price list
జూన్ లో షియోమి స్పెయిన్ మార్కెట్లో రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ స్పెసిఫికేషన్లే ఇందులో కూడా ఉన్నాయి. రెడ్ మీ 9 ప్రైమ్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ తో రానుంది. నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. రియల్ మీ నార్జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టిపోటీ ఇవ్వనుంది.