Redmi Note 13 Pro+ 5G: రెడ్‌మీ నుంచి నోట్ 13ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి

షియోమీ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సహకారంతో రెడ్‌మీ నోట్ 13ప్రో + 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ ఆవిష్కరించింది.

Redmi Note 13 Pro+ 5G World Champions Edition (Photo Credits: Official Website)

చైనా మొబైల్ దిగ్గజం రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ మిడ్ రేంజ్ ఫోన్ 13ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ (Redimi Note 13Pro+) ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. షియోమీ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సహకారంతో రెడ్‌మీ నోట్ 13ప్రో + 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ ఆవిష్కరించింది. రేర్ ప్యానెల్ పై ‘‘10’’ ఇంక్డ్ నంబర్ ముద్రిస్తారు.   బ్యాక్ ప్యానెల్‌పై బ్లూ, వైట్ స్ట్రైప్స్‌తోపాటు డ్యుయల్ టోన్ డిజైన్ తో ఫోన్ వచ్చింది. ఏఎఫ్ఏ బ్రాండింగ్‌తోపాటు ఎక్స్ క్లూజివ్ బాక్స్, యాక్సెసరీస్ జత చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. రూ. 14 వేలకే వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌, 6000ఎంఏహెచ్ బ్యాట‌రీ తో పాటు అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం..

రెడ్‌మీ నోట్ 13 ప్రో+ 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ రూ.34,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు చెల్లింపులపై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తోపాటు లాంచింగ్ ఆఫర్ ధర ప్రకటించింది. అయితే ఫోన్ వాస్తవ ధర రూ.37,999. దీనికి తోడు రూ.3000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తున్నది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, షియోమీ రిటైల్ స్టోర్లు, ఎంఐ డాట్ కామ్‌ల్లో మే 15 నుంచి కొత్త ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక రెడ్‌మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999లకు లభిస్తుంది. ఫుషన్ బ్లాక్, ఫుషన్ పర్పుల్, ఫుషన్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్‌లో మాదిరిగానే రెడ్‌మీ నోట్ 13ప్రో+ 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫీచర్లు ఉంటాయి. 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ విత్ 1.5కే రిజొల్యూషన్ (1220×2712 పిక్సెల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 200-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ లభిస్తుంది. 120వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif