Reliance Jio leads Airtel: ఎదురులేని జియో, 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడింగ్ స్పీడ్, కొత్త సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంలో టాప్, వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల జాబితాలో 427.67 మిలియన్ల యూజర్లతో అగ్ర స్థానంలో ముకేష్ అంబానీ జియో
4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడింగ్ స్పీడ్ పరంగా మరోసారి జియో అగ్రస్థానంలో (Reliance Jio leads Airtel) నిలిచింది. దీంతో పాటు ఏప్రిల్ నెలలో కొత్త సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో ఆధికత్య సాధించింది.
ఉచిత ఆఫర్లతో టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో (Reliance Jio) మరోసారి తన సత్తా చాటింది. 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడింగ్ స్పీడ్ పరంగా మరోసారి జియో అగ్రస్థానంలో (Reliance Jio leads Airtel) నిలిచింది. దీంతో పాటు ఏప్రిల్ నెలలో కొత్త సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో ఆధికత్య సాధించింది.
జూన్ నెలలో డౌన్‌లోడింగ్ స్పీడ్ విషయంలో ఇతర నెట్‌వర్క్‌ల కంటే సెకనుకు సరాసరి 21.9 ఎమ్‌బీపీఎస్ వేగంతో జియో నెట్‌వర్క్ అన్నింటి కంటే ముందు ఉంది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ ఒక రిపోర్టులో తెలిపింది. అలాగే, వోడాఫోన్ ఐడియా అప్‌లోడింగ్ స్పీడ్ పరంగా ముందంజలో ఉంది. వోడాఫోన్ సుమారు 6.2 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ పరంగా ముందు అన్నింటితో పోలిస్తే ఉంది. రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ వేగం మే నెలతో(20.7 ఎమ్‌బీపీఎస్) పోలిస్తే స్వల్పంగా పెరిగింది.
ఇక దీని సమీప పోటీదారుడు వోడాఫోన్ ఐడియా(డౌన్‌లోడ్ వేగం 6.5 ఎమ్‌బీపీఎస్) కంటే మూడు రెట్లు ఎక్కువ. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ వేగం స్వల్పంగా పెరగింది. ఇప్పటికీ 5 ఎమ్‌బీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో కనిష్ట స్థాయిలో ఉంది. ట్రాయ్ ప్రకారం, వోడాఫోన్ ఐడియా మే నెలలో సగటున 6.2 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. దాని తర్వాత రిలయన్స్ జియో 4.8 ఎమ్‌బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్‌టెల్ 3.9 ఎమ్‌బీపీఎస్‌తో ఉంది.
ఇక ఏప్రిల్ నెలలో రిలయన్స్ జియో అదనంగా 48 లక్షల సబ్‌స్క్రైబర్లను తన ఖాతాలో చేర్చుకుంది. కానీ దాని ప్రత్యర్థి సంస్థ ఎయిర్‌టెల్ ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబర్లను మాత్రమే పొందిందని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సోమవారం తెలిపింది. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల జాబితాలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని జియో 427.67 మిలియన్ల యూజర్లతో టాప్‌లో నిలిచింది. తర్వాతీ స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ 352.91 మిలియన్లు కాగా, వొడాఫోన్ ఐడియా 281.90 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది.
గత ఏప్రిల్‌లో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో జియో మార్కెట్ షేర్ 36.15 శాతం పెరిగింది. ఎయిర్‌టెల్ 29.83 శాతం, వొడాఫోన్ ఐడియా 23.83 శాతం యూజర్లను కలిగి ఉన్నాయి. అయితే, జియో సబ్‌స్క్రైబర్లు 92.5 మిలియన్ల మంది ఇన్ యాక్టివ్ కావడం ఇబ్బందికరమే. ఇది మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 21.63 శాతం. ఎయిర్‌టెల్ అత్యధికంగా 98.31 శాతం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల నిష్పత్తి కలిగి ఉండగా, వొడాఫోన్ 89.87 శాతం కలిగి ఉన్నాయని ట్రాయ్ డేటా తెలిపింది. ఇక ఫిక్స్‌డ్ వైర్‌లైన్ సెగ్మెంట్‌లో జియో టాప్ గెయినర్‌గా నిలిచింది. కొత్త కనెక్షన్లలో జియోకు 1,94,800 సబ్‌స్క్రైబర్లు జత కలిశారు. ఎయిర్‌టెల్ కేవలం 59,305 మంది యూజర్లను మాత్రమే పొందగలిగింది.