Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ
File Image of China's Long March rocket. Representational Image. (Photo Credits: Twitter)

Beijing, May 8: అంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.

అంతరిక్షం నుంచి రాకెట్లు శకలాలు తరుచూ భూమిపైకి దూసుకొస్తుంటాయి. అవి భూవాతావరణంలోకి వస్తుండగా కొన్నిశకలాలు పూర్తిగా గాలిలోనే మండిపోతాయి. భారీ సైజులో ఉండే రాకెటు శకలాలు కొన్ని భూమిపై పడి కొంత నష్టాన్ని మిగుల్చుతాయి.

చైనా ప్రయోగించిన టియాన్హే మ్యాడుల్‌ రాకెట్‌ శకలం సుమారు 20000 కేజీల బరువును, 30 మీటర్ల పొడవును కలిగి ఉంది. కాగా ఈ రాకెట్‌ భూమిపై పడితే చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టాన్నికలిగిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రాకెట్‌ శకలాలు భారత కాలమాన ప్రకారం మే 8న రాత్రి 7.30 నుంచి మే 10 తారీఖున అర్ధరాత్రి 1.00 గంటల మధ్య పడే అవకాశముందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం రాకెట్‌ ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, చైనా గుండా 41.5 డిగ్రీల అక్షాంశాలకు ఉత్తరంగా, 41.5 డిగ్రీల అక్షాంశాలకు దక్షిణంగా ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్‌ అంతర్జాతీయ జలాల్లో పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో 5జీ సేవలు, 13 కంపెనీల‌ దరఖాస్తులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చైనా కంపెనీలను 5జీ ట్ర‌య‌ల్స్‌కు దూరంగా ఉంచిన టెలికాం విభాగం

దీనిపై ఇప్పటి వరకు స్పందించని చైనా.. తాజాగా పెదవి విప్పింది. ఆ రాకెట్‌తో ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ మాడిమసైపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి గత నెల 29న కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ ఆ తర్వాత నియంత్రణ కోల్పోయింది.

గంటకు 18 వేల మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది. వేల టన్నుల బరువున్న ఈ రాకెట్ శకలాలు భూమిపై పడితే జరిగే నష్టం అపారం. అది భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు తప్ప ఎక్కడ కూలుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టమని నాసా కూడా ప్రకటించింది. దీంతో భయం మరింత ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో తాజాగా పెదవి విప్పన చైనా ఈ విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని పేర్కొంది. రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే చాలావరకు కాలిపోతుందని పేర్కొంది రాకెట్ శకలాలు ఎక్కడ కూలుతుందన్న విషయంపై తమ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తుంటారని వెన్‌బిన్ తెలిపారు. కాగా, అత్యంత వేగంతో దూసుకొస్తున్న లాంగ్‌మార్చ్ 5బి రాకెట్ శకలాలు కొన్ని నేడు భూమిపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ శకలాలు ప్రధానంగా సముద్రంలో పడొచ్చని ఎక్కువ మంది నిపుణుల అంచనా వేస్తున్నారు. న్యూయార్క్‌, మాడ్రిడ్‌, బీజింగ్‌, చిలీ, న్యూజిలాండ్‌ తదితర దేశాలు, ప్రదేశాల్లోనూ పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. గతేడాది చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ (తొలి వెర్షన్‌) శకలాలు పశ్చిమ ఆఫ్రికా ఐవోరీ తీరంలో పడి పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 1979లో అమెరికా అంతరిక్ష ల్యాబొరేటరీ ‘స్కైలాబ్‌’ కూలిన ఘటన తర్వాత ఇదే అతిపెద్ద రోదసి ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు.