Florida Plane Crash (PIC@ BNO X)

Florida, FEB 13: ఫ్లోరిడాలో అంతా చూస్తుండ‌గానే హైవేపై విమానం కుప్ప‌కూలింది (plane crash). ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. ఐదుగురిఓ వెళ్తున్న చిన్న ఇవిమానం ఫ్లోరిడా హైవేపై క్రాష్ ల్యాండింగ్ (Crash Landing) అయింది. ర‌హ‌దారిపై వెళ్తున్న‌కారును ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా (Viral Video) మారింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రకారం, బొంబార్డియర్ ఛాలెంజర్ 600 బిజినెస్ జెట్ నేపుల్స్ విమానాశ్రయానికి వెళుతుండగా, రెండు టర్బోఫాన్ ఇంజన్‌లు విఫలమయ్యాయి.

 

ఓహియో నుండి విమానం బయలుదేరిందని, ఆ తర్వాత ఇంజిన్ వైఫల్యం గురించి పైలట్ రేడియోలో ప్రసారం చేశారని NTSB తెలిపింది. నైరుతి ఫ్లోరిడాలోని గల్ఫ్ కోస్ట్‌లోని నేపుల్స్ సమీపంలో ఇంటర్‌స్టేట్ 75లో క్రాష్-ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానం మంటలు, పొగతో పూర్తిగా ద‌గ్ధ‌మైంది.  NTSB మరియు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, జెట్ ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్నది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని, మరో ఇద్దరు వ్యక్తులు మరణించారని, వారి బంధువులకు సమాచారం అందించామని, మృతులు ఎక్కడి నుంచి వచ్చారో పేర్కొనడానికి నిరాకరించినట్లు హైవే పెట్రోల్ ప్రతినిధి మోలీ బెస్ట్ తెలిపారు.