London, May 26: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై (White House) ట్రక్కు దాడి ఘటన మరువకముందే.. బ్రిటన్ ప్రధాని (UK PM) రిషీ సునాక్ (Rishi Sunak) అధికారిక నివాసంపై కూడా ఇదే తరహా దాడి జరగడం కలకలం రేపింది. లండన్ లోని (London) 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్ (Downing Street Residence) ను ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. గేటును కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు.
#BREAKING #UK #ENGLAND #LONDON
🔴 LONDON : #VIDEO BRITISH PM RISHI SUNAK HAS BEEN EVACUATED FROM HIS HOUSE OUT OF THE BACK ENTRANCE
after car crashes into Downing Street gate.#BreakingNews #UltimaHora #Inglaterra #Londres #CarCrash #Plot #RishiSunak #Plot
📹 @georgegrylls pic.twitter.com/0oHS1Koy6a
— LoveWorld (@LoveWorld_Peopl) May 25, 2023
సురక్షిత ప్రాంతానికి..
కారు దాడి జరిగిన సమయంలో రిషీ సునాక్ తన కార్యాలయంలో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం కార్యాలయాన్ని వీడిన ఆయన సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళినట్టు నిఘా వర్గాల సమాచారం.