Jio Good News: జియో యూజర్లకు శుభవార్త, జియో 100 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఉచిత మెసేజ్‌లు, దేశంలో ఎక్కడికైనా కాల్ చేసుకునే అవకాశం
ఇందులో భాగంగా రిలయన్స్ జియో (Reliance Jio) కూడా ఆ జాబితాలో చేరింది. ఇకపై జియో ఫోన్ వినియోగదారులకు (JioPhone users) ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ (Calls) చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది.
Mumbai, April 01: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) కొనసాగుతుండటంతో పలు టెలికాం కంపెనీలు వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో (Reliance Jio) కూడా ఆ జాబితాలో చేరింది. ఇకపై జియో ఫోన్ వినియోగదారులకు (JioPhone users) ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ (Calls) చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది.
జియో ఫోన్ వినియోగదారుల ప్రీపైయిడ్ వ్యాలిటిడీ పూరైనప్పటికీ.. వారికి ఏప్రిల్ 17 వరకు ఇన్‌కమింగ్ కాల్స్ సేవలు అందజేస్తామని తెలిపింది. జియో ఫోన్లు వాడుతున్న కొన్ని లక్షల మంది తమ బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి, ఒకవేళ అవసరమైతే హెల్త్‌కేర్ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. ఆఫ్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే జియో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది.
అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా జియో వినియోగదారులు సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ఎస్‌ఎంఎస్ బ్యాకింగ్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, కరోనావైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.