JioFiber Festival Bonanza: జియో కొత్త ఆఫర్లతో దుమ్మురేపింది, ఒక్క రీఛార్జ్‌తో రూ. 4,500 వరకు బెనిఫిట్స్, ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి
రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు.
దసరా సందర్భంగా జియో బంఫరాపర్లతో ముందుకొచ్చింది. రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై ఈ ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం..
JioFiber ₹599 ప్లాన్
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ కింద బెనిఫిట్స్
►రిలయన్స్ డిజిటల్‌లో ₹1000 తగ్గింపు
►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు
►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.
JioFiber ₹899 ప్లాన్
ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ కింద బెనిఫిట్స్
►రిలయన్స్ డిజిటల్‌లో ₹500 తగ్గింపు
► Myntraలో ₹500 తగ్గింపు
►Ajioలో ₹1000 తగ్గింపు
►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.
అయితే జియో ఫైబర్ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.