IPL Auction 2025 Live

RIL Investments Row: ముఖేష్ అంబానీ కంపెనీ భారీ పెట్టుబడులు, బ్రేక్‌త్రూ ఎనర్జీలో రిలయన్స్ రూ.373 కోట్ల పెట్టుబడి, Urban Ladderలో రూ. 182.12 విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) అమెరికాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కి (Bill Gates) చెందిన బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌ (Breakthrough Energy Ventures) సంస్థలో 50 మిలియన్‌ డాలర్ల (రూ.373 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నది.

Forbes Billionaire List 2018 Has Declared

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) అమెరికాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కి (Bill Gates) చెందిన బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌ (Breakthrough Energy Ventures) సంస్థలో 50 మిలియన్‌ డాలర్ల (రూ.373 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నది. వచ్చే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో విడతలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్‌ వెల్లడించింది. వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలు కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది.

సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ఇంధనాలు మొదలైన వాటిని ఆవిష్కరించేందుకు వెచ్చించనుంది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్‌ తెలిపింది.పెట్టుబడుల బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించినట్లు పేర్కొంది. రానున్న 8-10 సంవత్సరాల కాలంలో విడతలవారీగా ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ సాంకేతికత, బ్రేక్ థ్రూ ఎనర్జీ ద్వారా స్వచ్ఛమైన, ఉద్గారరహిత విద్యుత్తు శక్తిని కనుగొనేందుకు ఈ బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్‌ను ప్రారంభించారు. ప్రపంచాన్ని నెట్ జీరో ఉద్గారాలకు తీసుకు వెళ్లే లక్ష్యంతో దీనిని మొదలు పెట్టారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన డీల్‌ను రిజర్వు బ్యాంకు ఆమోదించాల్సి ఉన్నది.

జియో మరో సంచలనం, తక్కువ ధరకే మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్, రూ.2500 నుంచి రూ. 5 వేల లోపే ధర, దేశంలోకి ఇంకా రాని 5జీ

తాజాగా రిల్ (RIL) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) హోం డెకరేషన్ సొల్యూషన్స్ సంస్థ అయిన Urban Ladder Home Decor Solutions Private Ltd (Urban Ladder)లో 182.12 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం Urban Ladder ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది 96 శాతం హోల్డింగ్‌ను సూచిస్తుంది. అంతేకాదు మరో రూ .75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతిపాదించింది. తదుపరి పెట్టుబడులు డిసెంబర్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

UrbanLadder సంస్థను ఫిబ్రవరి 17, 2012 న ప్రారంభం కాగా, ఈ సంస్థ హోం ఫర్నిచర్, డెకార్ ఉత్పత్తుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే వ్యాపారంలో ఉంది. ఇది భారతదేశంలోని పలు నగరాల్లో రిటైల్ దుకాణాల చెయిన్ ను కలిగి ఉంది. అర్బన్ లాడర్ ఆడిట్ చేసిన టర్నోవర్ వరుసగా రూ .434 కోట్లు, రూ .151.22 కోట్లు, రూ .50.61 కోట్లు కాగా నికర లాభం /( నష్టం) రూ .49.41 కోట్లు, రూ .118.66 కోట్లు, రూ .457.97 కోట్లు గా ఉంది. పైన పేర్కొన్న పెట్టుబడి డిజిటల్ రంగంలో సంస్థ కొత్త వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృత పరిచేందుకు దోహదపడనుంది. అలాగే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ పెట్టుబడి సంస్థ ఎదుగుదలకు దోహదపడనుంది.