Feature Phones: అనవసరమైన ఆడంబరాలు ఎందుకు? ఎర్రబటన్, పచ్చబటన్ ఇవి చాలదా కనెక్ట్ అయిపోవటానికి? నోకియా బ్రాండ్‌పై రెండు సరికొత్త ఫీచర్ ఫోన్లు విడుదల

నోకియా బ్రాండ్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చాయి. వాటి విశేషాలు ఇలా ఉన్నాయి...

ఇప్పుడు మార్కెట్లో ఎన్నెన్నో ఫీచర్లతో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. రోజుకో కొత్త ఆఫర్ వస్తుంది. రోజురోజుకు టెక్నాలజీలో ఎంత దూసుకుపోతున్న సరే లైఫ్‌లో కొన్నికొన్ని సార్లు సింపుల్‌గా వ్యవహరించడం కూడా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్నేళ్ల క్రితం మొబైల్స్ అంటే ఎర్రబటన్, పచ్చబటన్ ఈ రెండు ఉంటే చాలు. ఆడుకోటానికి పబ్ జీనే అవసరంలేదు, స్నేక్ గేమ్ ఉన్నా చాలు, వాట్సాప్ మెసేజులు, బ్లాక్ చేయడాలు అప్పట్లో లేవు. అనవసరమైన టెన్షన్లు ఉండేవి కావు. ఏదైనా సూటిగా సుత్తిలేకుండా సాగిపోయేది. అప్పట్లో ఫోన్ అంటే నోకియానే. ఇప్పటికీ అలాంటి లైఫ్ ను మీరు ఇష్టపడితే, అలాంటి సాదాసీదా ఫోన్ లను ఉపయోగించాలనుకుంటే ఇప్పటికీ కూడా HMD Global సంస్థ అలాంటి ఫోన్ లను ఉత్పత్తి చేస్తుంది. రీసెంట్ గా ఆ సంస్థ 'నోకియా బ్రాండ్' తో రెండు ఫీచర్ ఫోన్ లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Nokia 220 4G

పాత మోడెల్ ఫోన్ నే రీమిక్స్ చేసి సరికొత్త డిజైన్ తో Nokia 220 4G ఫోన్ ను మళ్లీ విడుదల చేశారు. ఈ ఫోన్ బాడీని మృధువైన ప్లాస్టిక్ తో, ఇంపైన ఒంపుసొంపులతో అందించారు, ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చేతిలో ఒదిగిపోయి చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఇందులో ఒక సిమ్ కార్డ్ మాత్రమే అమర్చుకునే వీలుంది. ఫేస్ బుక్, ఒపెరా మినీ, నవీనమైన స్నేక్ గేమ్ ప్రీఇన్ స్టాల్డ్ గా అందిస్తున్నారు.

మిగతా విశిష్టతలు ఇలా ఉన్నాయి.

2.4 అంగుళాల QQVGA స్క్రీన్

16MB ర్యామ్ మరియు 24MB సామర్థ్యం

VGA కెమెరా మరియు LED ఫ్లాష్

1200mAh బ్యాటరీ

వీటితో పాటు MP3 ప్లేయర్, FM రేడియో, బ్లూటూత్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, మైక్రో USB పోర్ట్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్ 4జీ VoLTE కాల్స్ ను సపోర్ట్ చేయదు.

దీని ధర దాదాపు రూ. 3000/-

https://twitter.com/sarvikas/status/1153949413821169664

Nokia 105:

మరో ఫోన్ నోకియా 105 విషయానికి వస్తే ఇది కూడా స్వల్ప మార్పులు మినహా అన్ని ఫీచర్లు దాదాపు నోకియా 220 లాగే ఇచ్చారు. దీని బాడీ కూడా ప్లాస్టిక్ బాడీతో అందించారు అయితే ఇది కిందపడినా, దెబ్బలు తాకినా ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుందని చెప్తున్నారు.

దీని ఇతర ఫీచర్లు చూస్తే

1.77 అంగుళాల QQVGA స్క్రీన్

4MB ర్యామ్ మరియు 4MB సామర్థ్యం

800mAh బ్యాటరీ

LED ఫ్లాష్ లైట్, FM రేడియో, 3.5mm హెడ్ ఫోన్ జాక్ మరియు మైక్రో USB పోర్ట్ ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 1000/-

https://twitter.com/sarvikas/status/1153949948326531072



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif