Samsung Galaxy S25, Galaxy S25 Plus

New Delhi, JAN 23: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 సిరీస్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్‌ను గెలాక్సీ అన్‌ప్యాకడ్ 2025 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లు, గూగుల్ పిక్సెల్ లైనప్‌లతో పోటీపడే కొత్త రేంజ్ ఫోన్లను ఆవిష్కచింది. ఈ సిరీస్ ఫోన్ల ధరలు, ఫీచర్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్ స్పెసిఫికేషన్‌లు :

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంతలో, శాంసంగ్ ఎస్25 ప్లస్ అదే డిస్ప్లేను కలిగి ఉంది. కానీ, పెద్ద 6.7-అంగుళాల క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌తో వస్తుంది. శాంసంగ్ అన్ని గెలాక్సీ ఎస్25 స్మార్ట్‌ఫోన్‌లను కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అందిస్తుంది. క్వాల్‌కామ్ నుంచి పవర్‌ఫుల్ కొత్త ప్రాసెసర్ అక్టోబర్ 2024లో లాంచ్ అయినప్పటినుంచి ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లకు ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ  

శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్ 12జీబీ ర్యామ్‌తో వస్తాయి. కానీ, విభిన్న స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తాయి. గెలాక్సీ ఎస్25 ప్లస్ రెండు స్టోరేజ్ మోడల్‌లలో అందుబాటులో ఉంది. 256జీబీ, 512జీబీ అయితే ఎస్25 మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. అందులో 128జీబీ, 256జీబీ, 512బీబీ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 వేరియంట్‌లలోని కెమెరా సెటప్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 10ఎంపీ 3ఎక్స్ టెలిఫోటో సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో గత ఏడాది మాదిరిగానే ఉంది. ఫ్రంట్ సైడ్ 80-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది.

Realme 14 Pro 5G: రియల్‌ మీ నుంచి మరో సిరీస్‌ రిలీజ్‌, రూ. 4వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్, ప్రీ బుకింగ్స్ ఎప్పటినుంచి అంటే? 

శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్ గత ఏడాదిలో మాదిరిగానే 4,000mAh, 4,900mAh బ్యాటరీలతో వస్తాయి. 25డబ్ల్యూ సపోర్టు ఛార్జర్ సుమారు 30 నిమిషాల్లో ఎస్25 నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే, 45డబ్ల్యూ అడాప్టర్ అదే సమయంలో ఎస్25 ప్లస్ నుంచి 65శాతం వరకు ఛార్జ్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ 7 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా శాంసంగ్ లేటెస్ట్ వన్‌యూఐ 7తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 కలర్స్, స్టోరేజ్ వేరియంట్‌లు :

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 బేస్ వేరియంట్ ధర 799 డాలర్లు (సుమారు రూ. 69వేలు), 256జీబీ వేరియంట్ ధర 859 డాలర్లు (దాదాపు రూ. 74వేలు), అయితే శాంసంగ్ 512జీబీ మోడల్ ధరను వెల్లడించలేదు. అదే సమయంలో, గెలాక్సీ ఎస్25 ప్లస్ ధర 256జీబీ వేరియంట్‌కు 999 డాలర్లు, 512జీబీ మోడల్‌కు 1,199 డాలర్లు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 7 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అయితే, భారత స్మార్ట్‌ఫోన్‌ల ధర, లభ్యత వివరాలు ఇంకా ప్రకటించలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఫోన్ ధర 12జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ కోసం 799 డాలర్లు (దాదాపు రూ. 69,100) నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ+256బీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర 859 డాలర్లు (దాదాపు రూ. 74,300). 12జీబీ+512జీబీ ఆప్షన్ కంపెనీ ఇంకా ధర వివరాలను ప్రకటించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్ మొత్తం నేవీ, సిల్వర్ షాడో, ఐసీబ్లూ, మింట్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.