New Delhi, JAN 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 14 సిరీస్ (Realme 14) ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G), రియల్‌మీ 14 ప్రో + 5జీ (Realme 14 Pro+ 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్నాయి. గ్రే, కలర్ చేంజింగ్ పెరల్ వైట్ ఫినిష్ , బిక్‌నీర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. రియల్‌మీ 14 ప్రో+ 5జీ (Realme 14 Pro + 5G) ఫోన్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్, రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్ సెట్ బ్యాటరీలతో వస్తున్నాయి. రియల్‌మీ 14 ప్రో+ 5జీ ఫోన్ 50మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్896 సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, రియల్‌మీ 14 ప్రో 5జీ ఫోన్ 80వాట్ల పాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. రియల్‌మీ 14 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8జీబీ ర్యామ్ +256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 పలుకుతుంది. ఈ ఫోన్ జైపూర్ పింక్, పెరల్ వైట్, గ్రే రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మీ 14 ప్రో+ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.34,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్ బికనీర్ పర్పుల్, పెరల్ వైట్, గ్రే రంగుల్లో లభిస్తుంది.
అర్హత గల బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.4,000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 23 నుంచి రియల్‌మీ 14 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
రియల్‌మీ14 ప్రో+ (Realme 14 Pro+) ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్‌మీ యూఐ 6.0 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.83-అంగుళాల 1.5కే(1,272×2,800 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే, 3840 హెర్ట్జ్ పీఎండబ్ల్యూ డిమ్మింగ్, 1500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గ్లాస్ 7ఐ ప్రోటెక్షన్‌తో పని చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 50- మెగా పిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ ఐఎంఎక్స్896 ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్, 8- మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్896 ఆల్ట్రావైడ్ షూటర్, 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ పెరిస్కోప్ కెమెరా విత్ ఓఐఎస్ సపోర్ట్ విత్ అప్‌టూ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6ఎక్స్ లాస్‌లెస్ జూమ్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రియల్‌మీ14 ప్రో+ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లోనాస్, బైదూ, గెలీలియో, క్యూజడ్‌ఎస్‌ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల టైటాన్ బ్యాటరీతో వస్తోందీ ఫోన్.
రియల్‌మీ14ప్రో 5జీ ఫోన్ 6.77-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 50- మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 రేర్ కెమెరా విత్ ఓఐఎస్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. డ్యుయల్ స్పీకర్స్ విత్ హై రెస్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. రియల్‌మీ14ప్రో+ 5జీ ఫోన్‌లో మాదిరే కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లు కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులకు అనుగుణంగా పెరల్ వైట్ వేరియంట్ ఫోన్ రంగులు మారుతూ ఉంటుంది. 16 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫోన్ కలర్ తిరిగి వస్తుంది.