Robots could Lie: రోబోలూ అబద్ధాలు ఆడతాయి.. మనిషిలాగానే పరిస్థితులను బట్టి నటిస్తాయి.. తాజా అధ్యయనంలో వెల్లడి

అందులో చిట్టి అనే రోబో అబద్ధం అనేదే చెప్పదు. నిజజీవితంలోనూ రోబోలు అబద్ధాలు ఆడవంటూ ఇప్పటివరకూ అనుకున్నాం.

Robot (Photo Credits: Pixabay)

Newdelhi, Sep 6: రజినీకాంత్-శంకర్ సినిమా ‘రోబో’ (Robo) చూశారుగా. అందులో చిట్టి అనే రోబో అబద్ధం అనేదే చెప్పదు. నిజజీవితంలోనూ రోబోలు (Robots) అబద్ధాలు ఆడవంటూ ఇప్పటివరకూ అనుకున్నాం. అయితే, రోబోలు కూడా అబద్ధాలు ఆడగలవట. మనల్ని మోసం కూడా చేయగలవట. అమెరికాకు చెందిన జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. కృత్రిమ మేధస్సు మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో రోబోలు మనిషిలా ప్రవర్తిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!

రుజువేంటి?

రోబోలు అబద్ధాలు ఆడుతున్నాయి అనడానికి శాస్త్రవేత్తలు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తునారు. ప్రస్తుతం చాట్‌ బాట్స్‌ కొన్ని సందర్భాల్లో మనిషిని తప్పుదోవ పట్టిస్తున్నాయని, పరిస్థితులకు తగ్గట్టు నటిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఉదహరిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాల నుంచి మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif