Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్రళయ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి
బుధవారం నాడు భారత్ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.
Balasore, Dec 22: చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం (APJ Abdul Kalam Island) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి ఒక టన్ను వరకు వార్‌హెడ్‌ని మోసుకెళ్లగలదు.
ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని (Pralay Missile) భారత్ విజయవంతంగా ప‌్రయోగించిందని.. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ క్షిపణిని రూపొందించారు.
ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. కాగా, క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.