NASA Study: నాసా సంచలన రిపోర్ట్, సముద్రంలోకి జారుకోనున్న ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణంతో సహా 12 సముద్ర తీర ప్రాంత నగరాలు, ఈ శతాబ్దం చివరి నాటికి మూడు అడుగుల నీటి అడుగుకు ఈ నగరాలు చేరుతాయని అంచనా

నాసా సంచలన రిపోర్టును బయటకు తెచ్చింది. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ( Underwater by End of The Century) ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) (Intergovernmental Panel on Climate Change (IPCC) వెల్లడించింది.

NASA study on rising sea-levels (Photo Credits: NASA)

New Delhi, August 10: నాసా సంచలన రిపోర్టును బయటకు తెచ్చింది. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ( Underwater by End of The Century) ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) (Intergovernmental Panel on Climate Change (IPCC) వెల్లడించింది.

ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణాలతో మొత్తం 12 సముద్ర తీర ప్రాంత నగరాలు ఈ శతాబ్దం చివరినాటికి దాదాపు మూడు అడుగుల నీటి అడుగున చేరవచ్చని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పులను అంచనా వేసే ఐపీసీసీ 12 సముద్రతీర నగరాల్లో సముద్ర నీటిమట్టాలు పెరగవచ్చని ఐపీసీసీ హెచ్చరించింది. ఉష్ణోగ్రత, మంచు కవరు, గ్రీన్ హౌస్ వాయు పదార్థాలు సముద్రనీటి మట్టాలను ప్రభావితం చేస్తుందని ఐపీసీసీ విశ్లేషించింది.

ఘోర అగ్నిప్రమాదం, 17 రాష్ట్రాలకు అంటుకున్న మంటలు, 42 మంది అగ్నికి ఆహుతి, మరో 14 మంది సైనికులకు గాయాలు, ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో విషాద ఘటన

గతంలో 100 సవంత్సరాలకు ఒకసారి కనిపించే సముద్ర మట్టాల్లో మార్పులు 2050 నాటికి ప్రతీ 6 నుంచి 9 సంవత్సరాలకు జరగవచ్చని పేర్కొంది. సముద్ర తీరప్రాంతం కోతకు గురై నీటిమట్టం పెరుగుతూనే ఉంటుంది. 2006 నుంచి 2018 మధ్య ప్రపంచ సగటు సముద్ర మట్టం 3.7 మిల్లీమీటర్లు పెరిగింది.

కోడ్ రెడ్..మానవాళికి పెను ముప్పు, ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు, భారత్‌లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి-ఐపీసీసీ నివేదికలో వెల్లడి

హిమనీనదాలు కరిగిపోవడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల సముద్రతీర నీటిమట్టాలు పెరిగడం వల్ల ముంబై, మంగుళూరు, కొచ్చిన్, చెన్నై, విశాఖ పట్టణం, కండ్ల, ఓఖా, భావ్ నగర్, మర్ముగాం, పారాదీప్, ఖిదీర్ పూర్, ట్యూటీకోరిన్ నగరాల్లో మూడు అడుగుల మేర నీరు చేరే అవకాశముందని ఐపీసీసీ వివరించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now