GSAT-30: ఈ ఏడాది ఇస్రో ఆరంభం అదుర్స్, నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లిన GSAT 30, ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఇస్రో శాటిలైట్
ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి ఎరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Bengaluru, January 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ( ISRO)ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి ఎరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ రాకెట్ జీశాట్-30తో నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్ పోర్టులోని 3వ ఎరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు వెల్లడించింది.
Here's ISRO Tweet
ఇది కేవలం 38 నిమిషాల్లో జరగడం విశేషం.ప్రస్తుతం ఉన్న ఇన్‌శాట్- 4ఏ (ISRO's INSAT-4A) స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఇస్రో ( Indian Space Research Organization) ట్వీట్ చేసింది. జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది.
చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం
జీశాట్-30 ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిద్వారా టెలివిజన్, (DTH television services,)టెలీకమ్యూనికేషన్ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవల్ని అందిస్తుంది.
చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుండగా గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ (C-band)ద్వారా సేవలందిస్తారు.