India may again attempt soft landing on Moon next November (Photo-ANI)

Bengaluru,November 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చంద్రయిన్-3( Chandrayaan-3)ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 (Chandrayaan-2)ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.  చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

ఇదిలా ఉంటే తొలి ప్రయత్నం విఫలమైనా..మరోసారి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి(another soft landing on the Moon) సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆఖరిలో నవంబర్ నెలలో ఇస్రో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం

విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ ఆధారిత డైరెక్టర్ ఆఫ్ తిరువనంతపురం ఎస్. సోమనాథ్ (S Somanath, Director of Thiruvanathapuram-based Vikram Sarabhai Space Centre)నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇస్రో చేపట్టే అన్ని వెహికల్ ప్రొగ్రామ్ లాంచింగ్ లకు బాధ్యత వహించనుందని సమాచారం.

ఇందులో భాగంగానే చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగానికి కూడా రిపోర్టు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్యానెల్ రిపోర్టు కోసం ఇస్రో ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది ఆఖరులోగా మిషన్ ప్రిపేర్ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను కమిటీకి ఇచ్చేసినట్టు ఇస్రో సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థతో తెలిపారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ నెలలో ఇస్రో (Indian Space Research Organisation)కొత్త ప్రయోగం లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈసారి రోవర్, ల్యాండర్, ల్యాండింగ్ ఆపరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టిసారించనుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో లోపాలు పునరావృతం కాకుండా ఇస్రో చర్యలు చేపడుతుందోని బెంగళూరు కేంద్రీయ అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి.