PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ (PSLV-C53 Launch) గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది.

Isro lifts off 3 singaporean satellites. (Pic Credit- IANS)

ఇస్రో గురువారం నిర్వ‌హించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ (PSLV-C53 Launch) గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ముగియ‌గానే ఇస్రో ఈ రాకెట్‌ను రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ప్ర‌యోగించింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి (Three Singaporean Satellites in Orbit) తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్ర‌యోగం.

పీఎస్‌ఎల్వీ- సీ53 రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 365 కిలోల డీఎస్‌-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్‌, 2.8 కిలోల స్కూబ్‌-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో వాణిజ్య‌ప‌ర‌మైన రెండో మిష‌న్ ఇది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కాగానే, ఇస్రో శాస్త్ర‌వేత్త‌లంతా సంబురాల్లో మునిగితేలారు. చ‌ప్ప‌ట్లుకొడుతూ, ఒక‌రికొక‌రు అభినందించుకున్నారు.

బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కమర్షియల్‌గా ప్రయోగించడంలో ఇస్రో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. తక్కువ వాణిజ్య ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సౌలభ్యం కారణంగా చాలా దేశాలు భారత్ నుంచి ప్రయోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి.