Pythons Cures Heart Diseases: గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్‌ లు సాయపడుతాయ్.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

అయితే, ఇలాంటి జబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది.

Pythons Cures Heart Diseases (Credits: X)

Newdelhi, Aug 23: కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ వంటి గుండెజబ్బులు (Heart Diseases) ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే, ఇలాంటి జబ్బులను నయం చేయడానికి పైథాన్లు (Pythons) ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది. బౌల్డర్‌ లోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా ఒక పైథాన్‌ కు 28 రోజుల పాటు ఆహారం ఏమీ ఇవ్వకుండా ఉంచారు. తర్వాత దాని శరీర బరువులో పావు వంతు బరువైన ఆహారాన్ని అందించారు. ఇలా ఆహారాన్ని ఇచ్చినప్పుడు మిగతా పాముల కంటే ఈ పాము శరీరంలో గణనీయ మార్పులు వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పాము గుండె ధృడంగా మారిందని, పల్స్‌ రెట్టింపు అయ్యిందని తేల్చారు. ఈ ప్రక్రియలో అనేక ప్రత్యేకమైన జన్యువులు ఉత్తేజితమై పాములో జీవక్రియను పెంచినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో మనుషుల్లో కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ వంటి గుండె సమస్యలు వచ్చినప్పుడు  ఆ చికిత్సలో పైథాన్‌ లు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

బోట్స్‌ వానా గనిలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం గుర్తింపు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం ఇదేనోచ్..!

ఈ పైథాన్ లపైనే అధ్యయనం ఎందుకు?

మిగతా సరీసృపాలతో పోలిస్తే, పైథాన్ ల ఆహరశైలి భిన్నమైనది. ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు ఇవి ఉండగలవని, ఒక్కోసారి ఏడాది వరకు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తారు. అయితే, ఆహారం దొరికినప్పుడు మాత్రం తమ శరీర బరువు కంటే ఎక్కువ ఆహారాన్ని ఈ పైథాన్ లు తింటాయని వెల్లడించారు. ఈ స్థాయిలో ఆహారం తీసుకున్నప్పటికీ, వీటికి, వీటి గుండెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. అన్డుజే వీటిపై అధ్యయనం చేసినట్టు వివరించారు.

దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??



సంబంధిత వార్తలు