Ring of Fire in Solar Eclipse: రేపు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత.. ఆకాశంలో ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం.. ఈ అద్భుతాన్ని మళ్లీ చూడాలంటే 2046 వరకు వేచిచూడాల్సిందే!

సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.

Ring of Fire in Solar Eclipse (Credits: X)

Newdelhi, Oct 13: రేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి (Solar Eclipse) ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (Ring of Fire) (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది. దీని తర్వాత 2046 వరకు ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ కనిపించదని సైంటిస్టులు (Scientists) చెబుతున్నారు. కాగా ఈసారి సూర్యగ్రహణం భారత్‌ సహా అనేక దేశాల్లో కనిపించటం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నాసా సైంటిస్టు పెగ్‌ లూసి అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 4.30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.

ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ సపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటు, హమాస్ దాడి ఇజ్రాయెల్ దురాగతాలకు సహజ ప్రతిచర్యని తెలిపిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

సూర్యగ్రహణం కనిపించేది ఎక్కడంటే?

అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది. ఈ దేశాల్లో ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు.

Global Hunger Index 2023: దేశంలో ఆకలి కేకలంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక.. 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం.. భారత్ ఫైర్!