Newdelhi, Oct 13: భారత్‌లో (Bharat) అనేక మంది ఆకలితో (Hungry) అలమటిస్తున్నారంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (Global Hunger Index 2023) పేరిట విడుదలైన నివేదికను భారత్ ఖండించింది. ఇలాంటివి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని మండిపడింది. ఈ సూచి వాస్తవాన్ని ప్రతిఫలించట్లేదని వ్యాఖ్యానించింది. గురువారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023ను విడుదల చేశారు. మొత్తం 125 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ చివరన 111వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన దేశంలో 28.7గా ఉన్న ఆకలి సూచి.. ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారన్న విషయాన్ని సూచిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Global Hunger Index 2023: India slips 4 places, ranked 111 of 125 countrieshttps://t.co/njbZUpwF9m pic.twitter.com/a5RS7r6h7a
— Hindustan Times (@htTweets) October 12, 2023
భారత్ కంటే మెరుగైన స్థితిలో..
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో దాయాదిదేశం పాక్ 102 స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 60వ స్థానంలో.. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది.