Human Tail Loss: కోతుల నుంచి వచ్చిన మనిషికి తోక ఎందుకు లేదు?? కారణాలను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు

అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు.

Human Tail Loss (Credits: X)

Newdelhi, Mar 1: 2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు (Monkeys) ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు (Tails) ఉండేవట. అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో (Apes) తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు. డీఎన్‌ఏలో కొత్తగా చేరిన ఏఎల్‌యూవై (జంపింగ్‌ జీన్స్‌) అనే ప్రత్యేక జన్యువుల కారణంగానే మనుషుల్లో తోకలు పెరుగడం నిలిచిపోయిందని వాళ్లు తెలిపారు. ఇదేసమయంలో జంపింగ్‌ జీన్స్‌ లేకపోవడంతో కోతులు, ఎలుకలు, పిల్లుల వంటి జీవుల్లో తోకలు పెరుగడం అలాగే కొనసాగుతున్నట్టు వెల్లడించారు.

Danionella Cerebrum Fish: మనిషి గోరు సైజులో కూడాలేని ఈ చిన్ని చేప కూత పెడితే.. ఓ ఏనుగు అరిచినట్టు, గన్ పేల్చినట్టు ఉంటుందట.. నిజమేనండీ!!

పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకొన్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్‌ జీన్స్‌ను క్రమంగా ప్రవేశపెట్టారు. ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

FASTag-KYC Update: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ గడువు పొడిగింపు.. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారుల ప్రకటన