Newdelhi, Mar 1: ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అది. మనిషి గోరు అంత ఉంటుంది. పేరు డానియనెల్లా సెరెబ్రం (Danionella Cerebrum Fish). మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ చేప (Small Fish) కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే. శబ్దాల్ని చేయటంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్ కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ చేపలు 140 డెసిబుల్స్ వరకు శబ్దం చేయగలవని, ఇది ఏనుగు అరుపుకు, గన్ షాట్ కు, అంబులెన్స్ సైరన్ కు, జాక్ హ్యామర్ (డ్రిల్లింగ్ మిషన్) డ్రిల్లింగ్ శబ్దానికి సమానంగా ఉంటుందని చెప్పారు.
Danionella cerebrum, a small species of fish that measures no more than half an inch in length, is capable of producing sounds louder than an elephant, according to a new study. Here's how. https://t.co/Njh13ilu2e
— Yahoo News (@YahooNews) February 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)