Meaty Rice: మాంసపు బియ్యం.. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న మాంసకృత్తుల రైస్.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా..

దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు.

Meaty Rice (Credits: X)

Hyderabad, June 18: మారుతున్న జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితం, కల్తీ ఆహారం వెరసి శరీరానికి అవసరమైన పౌష్టిక ఆహారం కూడా లభించడంలేదు. దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు. దీన్ని మాంసపు బియ్యం (మీటీ రైస్) (Meaty Rice))గా పిలుస్తున్నారు. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోమాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్‌ చేసి.. సైంటిస్టులు దీన్ని సృష్టించారు. సాధారణ బియ్యంలో (Rice) ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌, 7 శాతం ఎక్కువ కొవ్వు దీంట్లో ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ‘మీటీ రైస్‌’ పర్యావరణ హితమైందని వివరించారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ 

గోవులను చంపకుండానే..

మార్కెట్లో దొరికే సాధారణ బియ్యంలాగే ‘మీటీ రైస్‌’ ఉన్నప్పటికీ తెలుపురంగులో కాకుండా ఈ బియ్యం గులాబీ రంగులో కనిపిస్తూ, మంచి వాసన కలిగివుంటాయి. ఈ బియ్యం కోసం గోవులను చంపారనుకుంటే పొరపాటే. జంతువుల్ని వధించకుండా, వాటి కణ జాలాన్ని పరిశోధకులు ల్యాబ్‌ లో అభివృద్ధి చేశారు.

రాయ్‌బరేలికి జై.. వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి

లాభమేంటి అంటే?

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు, కరువు కాటకాల్లో సంభవించే పౌష్టికాహార సమస్యను ఈ మీటీ రైస్ పరిష్కరం చూపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.



సంబంధిత వార్తలు