WhatsApp: వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?
అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు.
New Delhi, Feb 18: వాట్సాప్ (WhatsApp) వాడనిదే రోజు గడవదు. ప్రతిరోజు అనేక గ్రూపుల్లో మెసేజ్‌లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఛాటింగ్స్ (Chatting) చేస్తుంటాం.కొన్ని విషయాలను చెప్పేందుకు మాటల్లో కాకుండా సింపుల్ గా చెప్పేందుకు ఎమోజీలను(emojis) నిత్యం వాడుతూనే ఉంటాం. అయితే ఇక నుంచి ఎమోజీలను వాడాలంటే తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. ఇష్టం వచ్చినట్లు ఏది పడితే ఆ ఎమోజీని పంపితే కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం వచ్చింది. రెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji) విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జైలులో వేస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. రూ.20లక్షలు ఫైన్ వేయడమే కాదు జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే, ఈ రూల్ మన దేశంలో కాదు. సౌదీ అరేబియాలో ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.
కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో(Saudi Arabia).. ఈ తరహా రూల్ తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఆ దేశ పౌరులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దీన్ని వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. ఆ వ్యక్తికి రూ.20లక్షలు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
వాస్తవానికి సౌదీ అరేబియాలో (Saudi Arabia) తెలియని వాళ్లతో చాట్ చేయడానికి ప్రయత్నించడం కూడా నేరం కిందకు వస్తుంది. ఇప్పటికే కఠిన చట్టాలను అమలు చేస్తున్న సౌదీ అరేబియాలో...తాజా చట్టంతో సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది.