Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్, యూజర్లు అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైనా ఫార‍్వడ్ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే
ప్రీమియం యూజర్లు అకౌంట్ డీటెయిల్స్ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్ చేస్తే (Sharing your Netflix password ) అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి (charge you extra for sharing your password) ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్ డీటెయిల్స్ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్ చేస్తే (Sharing your Netflix password ) అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి (charge you extra for sharing your password) ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
తాజాగా యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగి లాంగ్ తెలిపారు. సాధారణంగా ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ యూజర్ తమ ప్రీమియం అకౌంట్ లను ఫ్రీగా షేర్ చేసే అవకాశం ఉండేది. దీంతో ఒక్క అకౌంట్‌ను యూజర్ తో పాటు కుటుంబసభ్యులు చూసేవారు. కానీ ఇకపై అలా ప్రీమియం అకౌంట్‌లను షేర్ చేస్తే 2 డాలర్ల నుంచి 3 డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఫీచర్‌పై వర్క్ చేస్తున్నామని చెంగిలాంగ్ చెప్పారు. ఎవరైతే ప్రీమియం అకౌంట్‌ను షేర్ చేస్తారో..కన్ఫర్మేషన్ కోసం కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తరువాత పైన చెప్పినట్లుగా 2 నుంచి 3 డాలర్లు అదనంగా చెల్లించాలని చెంగిలాంగ్ స్పష్టం చేశారు.ఇటీవల ఉక్రెయిన్‌పై చేస్తున్న రష్యా యుద్ధాన్ని నెట్‌ఫ్లిక్స్ వ్యతిరేకించింది. రష్యాలో నెట్‌ఫ్లిక్స్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా గతంలో సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. యూకేలో బేసిక్ ప్లాన్ వన్ స్క్రీన్ కాస్ట్ 9.99 డాలర్లు ఉండగా..14డాలర్లుగా ఉన్న స్టాండర్డ్ ప్లాన్‌ను 15.50కి పెంచింది. ఈ స్టాండర్డ్ ప్లాన్‌లో ఒకేసారి రెండు స్క్రీన్‌లలో లాగిన్ అవ్వొచ్చు. 4కే ప్లాన్ ధర 18డాలర్ల నుండి నెలకు 20కి పెంచగా.. ఇందులో ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో వీక్షించవవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ కెనడాలో తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరల్ని కూడా పెంచింది. కెనడాలో బేసిక్ ప్లాన్ 14.99 డాలర్ల నుండి 16.49కి పెంచింది. ప్రీమియం ప్లాన్ ధర 2డాలర్ల నుంచి 20.99కి పెంఇచంది. అయితే కెనడాలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధరల్ని పెంచలేదు. బేసిక్ ప్లాన్ ధర రూ.9.99గా ఉంది.