ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య ప్రకటించి.. దాదాపు ఇరవై రోజులు పైనే కావస్తోంది. ఉక్రెయిన్ త్వరగానే లొంగిపోతుందని భావించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఒకవైపు యుద్ధంతో ఉక్రెయిన్ చిధ్రం అవుతుండగా.. యుద్ధ సామాగ్రి సైతం తగ్గిపోతుండడంతో మిత్రదేశాల సాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్ పట్ల నిన్నమొన్నటిదాకా సానుకూలత ప్రదర్శించిన వాళ్లు సైతం.. ఇప్పుడు స్వరం మారుస్తున్నారు.
ఈ యుద్ధంపై ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రమ్మంటూ ఎలోన్ మస్క్ (Elon Musk) వేసిన ట్వీట్.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు ఈ ట్వీట్ మీద మండి పడుతున్నారు. మా బాస్‌కే ఛాంలెజ్ విసురుతావా అంటూ ఎటాక్ స్టార్‌చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఖండిస్తూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Tesla and SpaceX CEO) దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరులో తనతో తలపడాలంటూ సవాల్ విసిరాడు. ఏయ్ పుతిన్ నాతో ఒంటరిగా కలబడి పోరాడు. నీకు ఇదే నా ఛాలెంజ్! అంటూ ట్వీటేశాడు మస్క్. అంతేకాదు గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్‌లో వాటా అంటూ.. పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్ భాషలోనే ప్రస్తావించాడు.
ఎలన్ మాస్క్ చేసిన ట్వీట్‌పై రష్యా ఆధీనంలోని చెచెన్యా రిపబ్లిక్ హెడ్ రామ్‌జాన్ కేడీరోవ్ (Chechen Republic head mocks him) టెలిగ్రామ్‌లో ఎలన్ మాస్క్‌కు పంపిన మెసేజ్‌లో.. ఎలన్ మాస్క్ ! నువ్వు. పుతిన్ వేరు వేరు రంగాలకు చెందిన వారు. నువ్వేమో బిజినెస్‌మెన్, ట్విట్టర్ యూజర్‌వి పుతినేమో రాజకీయవేత్త, వ్యూహకర్త ఎలా కదనరంగంలో దిగుతారు. ఒకవేళ బాక్సింగ్ రింగులో మీరు తలపడితే.. అసలే స్పోర్ట్స్‌మాన్‌లా ఉంటే పుతిన్ దెబ్బకు నీలో ఉన్న దయ్యం ఎగిరిపోతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Here's Tweets
Вы согласны на этот бой? @KremlinRussia_E
— Elona Musk (@elonmusk) March 14, 2022
Can you turn off @Tesla in Russia as a sort of tech embargo?
— Fozzy Bear (@FozzyBearPDX) February 27, 2022
అయితే ఈ పంచులు ఇక్కడితే ఆగిపోలేదు. పుతిన్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌తో నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మరింత బలంగా మారాలి. ఇలా ఎలోనాగా ఉంటే సరిపోదు. నీకు కావాలంటే రష్యాలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తాను. అప్పుడు నువ్వు ఎలానా నుంచి ఎలన్‌గా మారవచ్చంటూ దెప్పి పొడిచాడు. అయితే వివాదాలను కొని తెచ్చుకునే అలవాటు ఉన్న ఎలన్‌మాస్క్.. రామ్‌జాన్ ( Ramzan Kadyrov) నుంచి వచ్చిన కవ్వింపు చర్యలకు మరింత రెచ్చిపోయాడు.
Here's Tweets
Telegram post by Ramzan Kadyrov, head of Chechen Republic! pic.twitter.com/UyByR9kywq
— Elona Musk (@elonmusk) March 15, 2022
నాకు మంచి ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాంటి శిక్షణ తీసుకోవడం నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు నాతో పోరాడటానికి పుతిన్ భయపడితే.. నాది లెఫ్ట్ హ్యాండ్ కాకపోయినా సరే పుతిన్‌తో కేవలం ఎడమ చేయితో ఫైట్ చేయడానికి నేను రెడీ రిటార్ట్ ఇచ్చాడు. అక్కడితో ఊరుకుంటే ఎలాన్‌మాస్క్ ఎలా అవుతాడు. ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసే సమయంలో తన డీపీ పేరును సైతం ఎలోనా మాస్క్‌గా మార్చుకుని (Elon Musk changes name as Elona Musk) మరింతగా రెచ్చగొట్టాడు ఎలన్ మాస్క్.
అయితే ఎలన్ మస్క్ ఏ మూడ్‌లో ఉండి ఈ ట్వీట్ ఏశాడో గానీ విపరీతంగా షేర్లు, లైకులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పుతిన్‌కు ట్విటర్ అకౌంట్ లేదు. అందుకే క్రెమ్లిన్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేసి మరీ ‘త్వరగా బదులు ఇవ్వాలంటూ’ సవాల్ విసిరాడు Musk.
ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాగానే తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ వ్యాప్తంగా ఎలన్ మస్క్ అందించిన విషయం తెలిసిందే!. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఎలన్ మస్క్‌కు వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా రష్యాలో టెస్లాతో పాటు ఇతర సంస్థల కార్యకాలాపాల్ని నిలిపివేయాలని కోరుతున్నారు. దయచేసి రష్యాలో అన్నింటిని డీయాక్టివేట్ చేయండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ చేస్తున్న మారణం హోమం సరైంది కాదని మండిపడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌లపై ఎలన్ మస్క్ స్పందించ లేదు.
చమురు సంస్థల షాక్, భారీగా పెరిగిన జెట్ ఇంధనం ధరలు, సామాన్యులకు విమాన ప్రయాణం ఇక భారమే
ఎలన్ మస్క్ ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంలో ప్రత్యక్షంగా కాక పోయినా పరోక్షంగా ఉక్రెయిన్ కోసం చేయాల్సిన వన్నీ చేస‍్తున్నారు. రష్యా దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో కమ్యునికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. కరెంటు, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు చిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఉక్రెయిన్లకు అండగా ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చాలా మంది ఈ ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు.
దాడులతో రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో తమ ప్రాణాల్ని నిలుపుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బంకర్లలో తలదాచుకుంటూనే రష్యా సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు. యుద్ధంలో తగిలిన గాయాలతో రక్తం ఒడుతున్నా తమ దేశాన్ని పరాయి దేశ పాలకుల చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని సవాలు విసురుతున్నారు.