Russian and Ukraine flags (Photo Credits: Pxhere/Pixabay)

Moscow, March 15: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఉక్రేనియన్ దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద కోట అయిన డోనెట్స్క్‌పై దాడి చేశాయని ( Russia-Ukraine War) తాజాగా రష్యా ఆరోపించింది. డోనెట్స్క్‌లోని నివాస పరిసరాల్లోకి తోచ్కా-యు క్షిపణిని (Tochka-U tactical missile) పంపిందని..ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ తెలిపారు. మరో 28 మంది గాయపడ్డారని (20 People Killed, 28 Injured) అన్నారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ సైనిక ప్రతినిధి లియోనిడ్ మత్యుఖిన్ ప్రకారం, ష్రాప్నెల్ వార్‌హెడ్‌తో కూడిన క్షిపణి రష్యాకు చెందిన రాకెట్. “ఇది నిస్సందేహంగా రష్యన్ రాకెట్ లేదా మరొక మందుగుండు; దాని గురించి మాట్లాడాల్సిన పని కూడా లేదని అతను పేర్కొన్నాడు. కైవ్ ఇండిపెండెంట్ ప్రకారం, డాన్‌బాస్‌లో భారీ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ ఘర్షణలో దాదాపు 100 మంది రష్యన్ సైనికులు మరణించారు. ఆరు వాహనాలను ఉక్రెయిన్ సాయుధ దళాలు నేలమట్టం చేశాయని ఉక్రెయిన్ మీడియా నివేదించింది. డొనెట్స్క్ ఒబ్లాస్ట్‌లో, రష్యా ఉక్రేనియన్ కోటలను ఉల్లంఘించడానికి ప్రయత్నించిందని నివేదిక జోడించింది.

భారత ప్రధాని మోదీకి పాక్ మహిళ కృతజ్ఞతలు, అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశారని వీడియోలో వెల్లడి

ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్‌ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్‌ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్‌ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్‌ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్‌ ప్రాంతంలో ఓ టీవీ టవర్‌ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్‌టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్‌ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్‌ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు.