Supreme Court: తప్పుచేయనప్పుడు భయమెందుకు, విచారణను ఎదుర్కోండి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఈ కామర్స్ దిగ్గజాలు వేసిన పిటిషన్ కొట్టివేత

విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయా సంస్థలకు కోర్టు తేల్చి చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును (Amazon, Flipkart to volunteer for CCI probe) నిలుపుదల చేయాలని కోరుతూ సదరు సంస్థలు వేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.

Supreme Court of India | (Photo Credits: IANS)

ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయా సంస్థలకు కోర్టు తేల్చి చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును (Amazon, Flipkart to volunteer for CCI probe) నిలుపుదల చేయాలని కోరుతూ సదరు సంస్థలు వేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంస్థల పిటిషన్ ను విచారించింది. యాంటీ కాంపిటీటీవ్ ప్రాక్టీస్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ మీద స్టే విధించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటి విచారణలు, పారదర్శకతకు స్వచ్ఛందంగా సహకరిస్తాయనుకుంటున్నామని జస్టిస్ రమణ అన్నారు. కానీ, మీరేమో అసలు విచారణే వద్దంటున్నారని కాస్తంత అసహనం వ్యక్తం చేశారు. ‘‘సీసీఐ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మీరు చెబుతున్నారు. ఏ తప్పూ చేయలేదంటున్నారు. అలాంటప్పుడు భయమెందుకు? విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని తేల్చి చెప్పారు. సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొన్న ఆయన.. వాటిని కొట్టేశారు. నాలుగు వారాల్లోగా సీసీఐ విచారణకు హాజరు కావాలని సంస్థలకు ఆదేశాలిచ్చారు.

ఆధార్ కార్డుదారులకు అలర్ట్, అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసిన యుఐడిఎఐ, తదుపరి నోటీస్ వచ్చే వరకు సదుపాయం నిలిపివేత, ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ సైట్లలో అమ్మే వస్తువుల్లో అన్ని రకాల వస్తువులకు సమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొన్ని వస్తువుల అమ్మకానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు కావాలనే కొందరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీనిపై తొలుత కర్నాటక హై కోర్టు విచారణ చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాధమిక విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు ఆ రెండు కంపెనీలకు నాలుగు వారాల గడువు ఇచ్చారు. దీంతో పాటు గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీం కోర్టు ‍ స్పందించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి మాకేం కనిపించడం లేదని పేర్కొంది.