Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు
ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Hyderabad, May 27: మొన్నటివరకూ అకాల వర్షాలతో (Rains) అతలాకుతలమైన తెలంగాణలో (Telangana) నేటి నుంచి సోమవారం వరకు ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (High Temperature) నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండంతోపాటు పొడి వాతావరణమే ఇందుకు కారణమని తెలిపింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్ర లోనూ..
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వీచనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కృష్ణ, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, విజయవాడలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని అంచనా వేసింది.