Tips For ITR Filing: ఈ టిప్స్ ఫాలో అవ్వ‌కుండా ఐటీ రిట‌ర్స్ ఫైల్ చేస్తే ఆదాయ ప‌న్ను నోటీసులు అందుకోక త‌ప్ప‌దు, ఇవి ఫాలో అయితే రిట‌ర్స్ చాలా ఈజీ

ఐటీఆర్ ల్లో దొర్లే తప్పులు సరిదిద్దుకోవచ్చు. అందుకు వెసులుబాటు కూడా ఉంది. రివైజ్డ్ ఐటీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు గానీ అందుకు టైం కేటాయించడం చికాకు పరిచే అంశం. కనుక ముందే జాగ్రత్త వహిస్తే ఏ ఇబ్బందులు ఉండవు.

Income Tax Return (Representational Image; Photo Credit: Pixabay)

Mumbai, July 13: వేతన జీవులు, చిరు వ్యాపారులు తమ ఆదాయాన్ని బట్టి ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేస్తారు. గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ (ITR Filing) దాఖలు చేయడానికి ఈ నెల 31 తుది గడువు. ఐటీఆర్ ఫైల్ చేసే విషయంలో సరైన అవగాహన లేకున్నా, నిపుణుల సాయం లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయడం కాసింత కష్టమే. చాలా మంది వరకూ జాగ్రత్తగానే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు కానీ.. కనుక ఐటీఆర్ ఫైలింగ్ టైంలో తప్పుల్లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..!

ఇప్పటికే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) జారీ చేసిన ఏడు రకాల ఐటీఆర్ ఫామ్స్‌లో (ITR Forms) సరైన ఫామ్ ఎంచుకోవాలి. రూ.50 లక్షల్లోపు ఆదాయం, ఒక ఇంటిపై ఇన్ కం, వడ్డీ తదితర రూపాల్లో ఆదాయం వస్తే ఐటీఆర్- 1 ఫైల్ చేయొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, రూ.50 లక్షల పై చిలుకు ఆదాయం గల సంస్థలు ఐటీఆర్-4 సెలెక్ట్ చేసుకోవాలి. వృత్తి నిపుణుల్లో ఐటీఆర్-1, ఐటీఆర్-2 విషయంలో అనుమానాలు ఉన్నట్లయితే ఐటీఆర్-3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయ విక్రయాలు చేస్తే.. ఆయా లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2, ఐటీఆర్-3ల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీలు, వ్యాపార సంస్థల యాజమాన్యాలు మిగతా ఫామ్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

Term Policy Premium Hiked: లైఫ్ ఇన్సురెన్స్ తీసుకుంటున్న‌వాళ్ల‌కు అల‌ర్ట్! భారీగా ప్రీమియం పెంచేసిన కంపెనీలు, ఏయే సంస్థ‌లు ఎంత పెంచాయంటే? 

ట్యాక్స్ పేయర్లంతా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాల వివరాలను ధ్రువీకరించాలి. దీంతో ట్యాక్స్ పేయర్ల (Tax Payers) బ్యాంక్ ఖాతా యాక్టీవ్ గా ఉందని నిర్ధారణ వస్తుంది. అలా నిర్ధారణ వస్తేనే ఆదాయం పన్ను విభాగం.. సంబంధిత పన్ను చెల్లింపుదారుడికి రీఫండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేశాక, దాన్ని టాక్స్ పేయర్లు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫికేషన్ చేసుకుంటేనే ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయినట్లు భావిస్తారు. లేకుంటే ఐటీ రిటర్న్స్ పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ ఫామ్ అప్ లోడ్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటది.

Koo Shutting Down: ఎలాన్ మస్క్ ఎక్స్ ముందు నిలబడలేకపోయిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ, ఆర్థిక నష్టాలతో షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటన 

ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ద్వారా ప్రతి ఒక్కరూ వివిధ పథకాల్లో మదుపు ద్వారా రూ.1.50 లక్షల వరకూ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణం అసలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ వంటి బీమా పాలసీ ప్రీమియం చెల్లింపులు ఈ సెక్షన్ కిందకు వస్తాయి. ఇక సెక్షన్ 80డీ కింద హెల్త్ బీమా ప్రీమియం వివరాలు రికార్డు చేయాలి. సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం మీద రూ.10 వేల వరకూ 80టీటీఏ కింద డిడక్షన్ ఉంటుంది. సెక్షన్ 80జీజీ కింద హెచ్ఆర్ఏ క్లయిమ్ చేయొచ్చు. పన్ను ఆదాతోపాటు ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు, ఇతర పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించి ఐటీఆర్ లో సరైన వివరాలు నమోదు చేయాలి.

ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఐటీఆర్ ఫామ్ లో నమోదు చేయరు. వడ్డీ, కమిషన్ వంటి ఆదాయం గురించి ప్రస్తావించరు. వీటిపై టీడీఎస్ డిడక్ట్ చేస్తారని నమోదు చేయకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గడువులోపు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాల్సిందే. గడువు దాటితే రూ.1000 – రూ.5,000 వరకు పెనాల్టీ పే చేయాలి.