Representational Image (File Photo)

Mumbai, July 11: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల (Term Policy Premium) ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (HDFC Life), మ్యాక్స్‌ లైఫ్‌ (Max Life), బజాజ్‌ అలియాంజ్‌, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి. భారతీయ మూడో అతిపెద్ద జీవిత బీమా సంస్థ, రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బీమా సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. తమ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంల ధరలను దాదాపు 10 శాతం మేర పెంచినట్టు చెప్తున్నారు. అయితే 60 ఏండ్లకుపైబడినవారికే ఈ పెంపు వర్తిస్తుందని అంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మొత్తం వ్యక్తిగత వార్షిక ప్రీమియంల విలువలో 5 శాతానికి సమానంగా దాని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంల వాటా ఉన్నది.

UiPath Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 450 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath 

టాటా ఏఐఏ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలూ 3 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగాయి. బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యక్తిగత వార్షిక ప్రీమియంలలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వాటా 6 శాతంగా ఉన్నది.

మరికొన్ని కంపెనీలూ తమ బీమా ప్రీమియంల రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ పాలసీల ధరలు 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రం పెంపునకు నో అంటున్నాయి. ఎల్‌ఐసీ, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు ఇప్పటికైతే పెంచబోవడం లేదంటున్నాయి. కాగా, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, జనాభా, స్థిరం గా సాగతున్న రీఇన్సూరెన్స్‌ ఖర్చుల నేపథ్యంలోనే ప్రీమియంల ధరల్ని సవరించాల్సి వస్తున్నదని బీమా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో టర్మ్‌ ఇన్సూరెన్స్‌లకు పెరుగుతున్న ఆదరణ కూడా రేట్ల పెంపునకు కారణమేనన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.