TikTok vs America: ట్రంప్‌పై అమెరికా కోర్టులో టిక్‌టాక్ ఫిర్యాదు, అమెరికా అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టును ఆశ్రయించిన చైనా యాప్, అగ్రరాజ్యంలో టిక్‌టాక్, వీ చాట్‌‌లపై నిషేధం

ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను నిషేధించామని యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ తెలిపింది. కాగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.

TikTok logo (Photo Credits: IANS)

చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు (TikTok Ban) అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను నిషేధించామని యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ తెలిపింది. కాగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 15లోపు, టిక్‌ టాక్, వీ చాట్‌ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా (America) చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్‌ (Donald Trump) గతనెలలోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ చెప్పారు. టిక్‌ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్‌ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ నిషేధాన్ని స‌వాల్ చేస్తూ టిక్‌టాక్ సంస్థ‌.. అమెరికా కోర్టును (TikTok Files Lawsuit Against Donald Trump) ఆశ్ర‌యించింది. టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ శుక్ర‌వారం రాత్రి ట్రంప్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ కోర్టులో ద‌ర‌ఖాస్తు న‌మోదు చేసింది. ట్రంప్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ టిక్‌టాక్ కోర్టును ఆశ్ర‌యించ‌డం ఇది రెండ‌వ‌సారి. ట్రంప్ త‌న అధికారాల‌ను దుర్వినియోగం చేశార‌ని బైట్‌డ్యాన్ త‌న ఫిర్యాదులో ఆరోపించింది.

పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు

కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం యాప్‌ను బ్యాన్ చేసిన‌ట్లు పేర్కొన్న‌ది. బ్యాన్ విధించ‌డం వ‌ల్ల‌ భావ‌స్వేచ్చ హ‌క్కుల‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని టిక్‌టాక్ ఆరోపించింది. త‌మ భావాల‌ను వ్య‌క్తప‌రిచేంద‌కు ల‌క్ష‌లాది మంది అమెరికా పౌరులు ఆన్‌లైన్ ద్వారా ఒక్క‌ట‌య్యార‌ని, వారిని ట్రంప్ స‌ర్కార్ అడ్డుకుంటోంద‌ని త‌మ ఫిర్యాదులో టిక్‌టార్ పేర్కొన్న‌ది. అమెరికా యూజ‌ర్ల ప్రైవ‌సీ, భ‌ద్ర‌త విష‌యంలో టిక్‌టాక్ క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని, తాము చూపిన ఆధారాల‌ను ట్రంప్ స‌ర్కార్ విస్మ‌రిస్తున్న‌ద‌ని బైట్‌డ్యాన్స్ వెల్ల‌డించింది.

దీనిపై చైనా స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, (దాని) తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా అమెరికాను కోరుతోందని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది.

అమెరికా జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ యాప్‌ ఆదివారం నుంచి అగ్రరాజ్యంలో తన కార్యాచరణను కోల్పోతుంది. ఇక టిక్‌టాక్‌పై ప్రస్తుతం అప్‌డేట్‌ ఇన్‌స్టాల్ చేయకుండా నిషేధం విదించారు. కాకపోతే నవంబర్ 12 వరకు టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయవచ్చు.



సంబంధిత వార్తలు