TikTok-Triller Deal Rumors: దూసుకొస్తున్న అమెరికా గడువు, టిక్ టాక్‌పై కన్నేసిన మరో అమెరికా దిగ్గజం, 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో ట్రిల్లర్ సంప్రదింపు, అలాంటిదేమి లేదని తెలిపిన టిక్ టాక్
TikTok logo (Photo Credits: IANS)

ఇండియాలో బ్యాన్ అయిన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ (TikTok) కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ (Triller) చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను (ByteDance) సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో (TikTok-Triller Deal) సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది.

టిక్‌టాక్‌ కాకుండా టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌కు నేరుగా బిడ్ చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికస్ ద్వారా బైట్‌డాన్స్ ఛైర్మన్‌కు నేరుగా ఆఫర్‌ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెష్ట్ చెప్పారు. డైరెక్టుగా ఛైర్మన్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

అయితే, ఈ వార్తలను టిక్‌టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్‌ను (TikTok-Triller Deal Roumars) అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది.

ఇదిలా ఉంటే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది. సుమారు. 20-30 బిలియన్ల డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భవిస్తోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మైక్రోసాఫ్ట్ తో జతకడుతున్నట్లు ధృవీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ మూడు దిగ్గజ కంపెనీలతో బైట్‌డాన్స్ చర్చలు జరుపుతోంది. రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు

కాగా జాతీయ భద్రతా సమస్యలరీత్యా టిక్‌టాక్ ను నిషేధిస్తామని ఇప్పటికే హచ్చరించిన ట్రంప్ అమెరికా కార్యకలాపాలను విక్రయించాలని ఒత్తిడి పెంచారు. ఇందుకు 45 రోజుల్లోపు అమెరికాలో బైట్‌డాన్స్ ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత దీన్ని 90 రోజులకు పెంచుతూ ఆగస్టు 14 న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు ట్రంప్ మొదటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై టిక్‌టాక్ దావా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్, భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన

చైనాకు చెందిన టిక్‌టాక్ తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్‌ నిషేధం తప్పదంటున్న అమెరికాపై చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. అమెరికా తమ దేశానికి చెందిన వీ చాట్‌ను బ్యాన్ చేస్తే.. అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్తులను కూడా బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు జాచైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు తమ అమెరికా బిజినెస్‌ను ఇతర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్రయించాలంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై తాజాగా చైనా విదేశాంగ శాఖ స్పందించింది.  పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు

చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం వాల్‌మార్ట్ చేరింది. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి టిక్‌టాక్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోనున్నామని వాల్‌మార్ట్ తాజాగా ప్రకటించింది. పదవిలో చేరిన మూడు నెలల కాలంలోనే టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన గంటల అనంతరం వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేసింది. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించడానికి బైట్‌డాన్స్ నిరాకరించింది. అమెరికాలోని టిక్‌టాక్ విభాగం కొనుగోలుకు టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. మరోవైపు టిక్‌టాక్‌ కొనుగోలుకు ఒరాకిల్ గ్రూప్ అయితే బావుంటుందని ట్రంప్ ఇటీవల హింట్ ఇచ్చారు. చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా యూజర్ల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటే ట్రంప్ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడున్నారు. అమెరికాలోని టిక్‌టాక్‌ వ్యాపారాన్ని అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని టిక్‌టాక్‌ను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం కూడా చేసిన ఆయన విక్రయానికి సమయాన్నిచ్చారు.

ఇక ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కెవిన్ మేయర్ త‌న ప‌ద‌వి నుంచి వైదొలిగారు. ప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈవోగా కొన‌సాగ‌నున్న‌ట్లు కంపెనీ ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్న‌ారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్‌కు ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధాన్ని పరిశీలిస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్, తమ వద్ద మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి, మెక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని ఊహాగానాలు

కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో చైనా వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం షేధించింది. ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ప్ర‌పంచానికి అంట‌గ‌ట్టారంటూ చైనాపై ప‌లు దేశాలు ఆగ్ర‌హంగా ఉన్నాయి. ఇప్ప‌టికే చైనాతో వ్యాపార ఒప్పందాల‌ను తెగ‌దెంపులు చేసుకున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్ సీఈవో కెవిన్ ప‌దవికి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.