TikTok Layoffs: ఆగని లేఆప్స్, 700 మంది ఉద్యోగులను తొలగించిన టిక్‌టాక్‌, మార్కెటింగ్‌, కంటెంట్‌ విభాగాల్లోనే తొలగింపులు

700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ప‌లికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌ అందినట్లు స‌మాచారం. కాగా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

TikTok Layoffs: The Social Media Firm Fires Over 700 Employees, Says Report

టిక్‌టాక్‌ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ప‌లికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌ అందినట్లు స‌మాచారం. కాగా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఉద్వాస‌న‌ను టిక్‌టాక్ ధృవీక‌రించింది.

వ‌రుస‌గా ప‌దోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

అయితే ఎంతమందిని తొలగించిందనే విషయాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. తన వ్యూహాత్యక చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్ల‌డించింది. ఇక 2024 మేలో కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులను టిక్‌టాక్‌ తొలగించిన విష‌యం తెలిసిందే. మార్కెటింగ్‌, కంటెంట్‌ విభాగాల్లోనే ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయి.