Twitter Tricks: సంక్షోభంలో ట్విట్టర్, ఒకవేళ మూతపడితే మీ అకౌంట్ సంగతేంటి? ట్విట్టర్‌లోని డాటాను ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

#GoogdByeTwitter, #RIPTwitter వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ ఎప్పుడైనా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందని యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే, ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందో లేదో మాకు తెలియదు, ఎందుకంటే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలేదు.

Elon Musk & Twitter (File Photo)

New Delhi, NOV 18: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలన్ మస్క్ (Elon Musk) దెబ్బకు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎలాన్ మస్క్ ఉద్యోగులకు రాజీనామాలు చేయాలంటూ “అల్టిమేటం” జారీ చేయడంతో ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు ఈ-మెయిల్ (Email) ద్వారా మస్క్ ఇంటికి పంపాడు. మస్క్ చర్యలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఉద్యోగులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. దాంతో ట్విట్టర్‌లో (Twitter) ఎప్పుడైనా షట్ డౌన్ (Twitter Shutdown) అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారమే ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ ఈ-మెయిల్ పంపారు. అందులో ప్రతి ఒక్కరూ Twitter 2.0 కోసం రెడీగా ఉండాలని, హార్డ్‌కోర్ వర్క్ కల్చర్‌కు కట్టుబడి ఉండాలని, మూడు నెలల వేతనంతో సెలవు పెట్టాలని కోరారు. ఈ క్రమంలో చాలామంది ట్విట్టర్ ఉద్యోగులు రాజీనామాలకే మొగ్గు చూపారు. మస్క్ ట్విట్టర్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటికే 50 శాతానికి పైగా సిబ్బంది, దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఎలన్ మస్క్.. 20 మంది బేసి ఉద్యోగులను కూడా తొలగించాడు. భారత్ సహా అనేక దేశాలలో ట్విట్టర్ అనేక మంది ఉద్యోగులను తొలగించాడు. స్లాక్ గ్రూప్‌పై మస్క్‌ వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించారు. ట్విట్టర్ ఉద్యోగుల సామూహిక రాజీనామాలతో నవంబర్ 21 వరకు అన్ని ఆఫీసులను మూసివేయాలని, బ్యాడ్జ్ యాక్సెస్‌ను రద్దు చేయాలని మస్క్ ఆదేశించాడు.

Twitter Shuts Offices: ట్విట్టర్ ఆఫీసులు షట్‌డౌన్, వరుస రాజీనామాలతో ఎలాన్ మస్క్‌కి షాకిచ్చిన ఉద్యోగులు, వంద‌ల సంఖ్య‌లో ఉద్యోగులు రిజైన్ చేస్తున్న‌ట్లు వార్తలు 

ఈ నేపథ్యంలో ట్విట్టర్ యూజర్లలో గందరగోళం నెలకొంది. #GoogdByeTwitter, #RIPTwitter వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ ఎప్పుడైనా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందని యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే, ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందో లేదో మాకు తెలియదు, ఎందుకంటే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలేదు.

కానీ, మీరు అలా అనుకుంటే.. మీ ప్రొఫైల్ డేటా, మీ ట్వీట్‌లు, మీ డైరెక్ట్ మెసేజ్‌లు, మీ మూమెంట్స్, మీ మీడియా (మీరు ట్వీట్‌లు, డైరెక్ట్ మెసేజ్‌లకు యాడ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు), మీ ఫాలోవర్ల లిస్టు, మీరు ఫాలో అయ్యే అకౌంట్ల లిస్టు, మీ అడ్రస్ బుక్, మీరు క్రియేట్ చేసిన లిస్టు, మెంబర్లు లేదా ఫాలో అయ్యే లిస్టు, జనాభా డేటా ఇలా మొత్తం డేటాను యూజర్లు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం Twitter డేటాను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? అనేది ఈ ప్రక్రియ ద్వారా Twitter Android, iOS యాప్‌లు, డెస్క్‌టాప్ రెండింటిలోనూ పనిచేస్తుంది.

TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ సంచలన నిర్ణయం, గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే..ఆ కాలర్ పూర్తి వివరాలు కనిపించేలా కెవైసీ ఫీచర్ 

* Timelineకు లెఫ్ట్ వైపున ప్రధాన నావిగేషన్ మెనులో ‘More’ ఆప్షన్‌పై Click చేయండి.

* Settings, Privacy ఎంచుకోండి.

* మీ అకౌంట్ ఆప్షన్ ఎంచుకోండి.

* ఆ తర్వాత, మీ డేటా Archive డౌన్‌లోడ్ ఎంచుకోండి.

* మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించండి. ఆపై Archiveను ఎంచుకోండి.

Twitter మీ డేటాను షేర్ చేసేందుకు దాదాపు 24 గంటలు పడుతుంది. మీ వివరాలు ఈ-మెయిల్‌లో షేర్ అవుతాయి. కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో ఇలా పేర్కొంది. మీ archive సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ-మెయిల్‌ను యాప్‌లో నోటిఫికేషన్‌ను అందుకుంటారు. మీ డౌన్‌లోడ్‌లో ‘Your archive’ అనే ఫైల్ ఉంటుంది. అది మీ డేటాను డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లో చూసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.