
గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ ఎంత చికాకు తెప్పిస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే అది ఎవరు చేశారో (Unknown Caller Bothering You) తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. కాల్ స్వీకరించినప్పుడు కాలర్ పేరు డిస్‌ప్లే మీద కనిపించేలా సరికొత్త మార్పులు తీసుకురానుంది.
ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా (TRAI Likely To Introduce KYC-Based Measures) టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ (KYC) రికార్డ్‌ను బట్టి కాల్ చేసిన వారి పేరు డిస్ ప్లే అవుతుందని ట్రాయ్ వెల్లడించింది.
ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించుకుంటున్నారు.అయితే ఈ యాప్ అంత సెక్యూర్ కాదన వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం కచ్చితంగా ఉండేలా ట్రాయ్ ప్రణాళిక రచిస్తోంది.