గత కొంత కాలం నుంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ మీద ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. నవంబరు 29 బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు మొదలవుతుందని ట్విటర్ ద్వారా వెల్లడించారు.తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తమ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ ధృవీకరించని ఖాతాలు పేరు మార్చుకుంటే బ్లూటిక్ కోల్పోతారని కూడా తెలిపారు.
యూట్యూబ్ నుంచి మరో కొత్త ఫీచర్, Shortsలో కొత్త షాపింగ్ ఫీచర్‌లను పరీక్షిస్తున్న దిగ్గజ వీడియో సంస్థ
44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్ మస్క్ నెలకు 8డాలర్ల బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ప్రకటించారు. అయితే నకిలీ ఖాతాల బెడద కారణంగా బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.