ఎలాన్ మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్నప్పటి నుంచి సంస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ సమయం పనిచేయాలని ఎలన్ మస్క్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు లేక ట్విట్టర్ సంస్థకు చెందిన ఆఫీసు బిల్డింగ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
మళ్లీ ఆఫీసు కార్యాలయాలను నవంబర్ 21వ తేదీ నుంచి తెరువనున్నట్లు ఉద్యోగులకు సమాచారం చేరవేసినట్లు ఆ సంస్థ తెలిపింది.అయితే ఎందుకు ఆఫీసులను మూసివేస్తున్నారన్న దానిపై ట్విట్టర్ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యోగులు మాత్రం తమ ఇంటర్నల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థను వీడుతున్నట్లు మెసేజ్‌లు చేశారు.ఇక సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ముందుగా ఇవ్వనున్నారు.
Twitter shuts offices after mass resignations. What it told employees – Full Text here https://t.co/LOZNOFrF6n https://t.co/OwkOt97ODo
— india business port (@indiabusines) November 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)