Twitter Data Leak: ట్విటర్ వాడుతున్నారా? అయితే వెంటనే పాస్‌వర్డు మార్చుకోండి! కోట్లాదిమంది యూజర్ల మెయిల్ ఐడీలు, పాస్‌వర్డులను అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు, మీ వివరాలు కూడా ఉండే అవకాశం
డార్క్ వెబ్ సైట్‌లో ప్రత్యక్షమైన కోట్లాది మంది డేటాలో మీది కూడా ఉండే అవకాశం ఉంది. రెండు నెలల క్రితమే 50 లక్షల మందికి పైగా యూజర్ల ట్విట్టర్ ఖాతాల డేటా హ్యాకర్ల పాలైంది. తాజాగా 235 మిలియన్ యూజర్ల డేటా డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైంది.
New York, JAN 01: మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? అయితే మీ వ్యక్తిగత మెయిల్ వివరాలు, ఫోన్ నెంబర్, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు వేరేవ్యక్తుల చేతుల్లో ఉండే అవకాశం ఉంది. డార్క్ వెబ్ సైట్‌లో ప్రత్యక్షమైన కోట్లాది మంది డేటాలో (Twitter Data Leak) మీది కూడా ఉండే అవకాశం ఉంది. రెండు నెలల క్రితమే 50 లక్షల మందికి పైగా యూజర్ల ట్విట్టర్ ఖాతాల డేటా (users’ private information) హ్యాకర్ల పాలైంది. తాజాగా 235 మిలియన్ యూజర్ల డేటా డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైంది. కోట్లాది మంది ట్విట్టర్ యూజర్ల డేటా హ్యాకింగ్ కు గురైందని ఓ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచినట్టు సదరు నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ (Hudson Rock) వెల్లడించింది.
ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నెంబర్లను హ్యాకర్ డార్క్ వెబ్ లో విక్రయానికి ఉంచాడని వివరించింది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజి అని హడ్సన్ రాక్ తెలిపింది. అయితే డిసెంబర్ నెలలో 400 మిలియన్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ లో పెట్టగా...అందులో నుంచి డూప్లికేట్, ఫేక్ యూజర్ల వివరాలను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 235 మిలియన్ల యూజర్లకు సంబంధించి మెయిల్ ఐడీలు, ఇతర వివరాలతో కూడిన ఫైల్ ను సేల్‌కు పెట్టారు హ్యాకర్లు. దీంతో చాలా మంది తమ యూజర్ నేమ్, పాస్ వర్డులను మార్చుకుంటున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు.