Smartwatch Saves Life: గుండెపోటుతో కుప్పకూలిన సీఈఓ, భార్యను అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌ వాచ్‌

మోరిస్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సీఈఓ మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లాడు. ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇంట్లో ఉన్న భార్య లారాకు ఫోన్‌ చేశాడు.

New Apple Watch Series 4 (Photo Credits: Twitter)

బ్రిటన్‌లో స్మార్ట్‌ వాచ్‌ హాకీ వేల్స్‌ కంపెనీ సీఈవో 42 ఏళ్ల పాల్‌ వాపమ్‌ ప్రాణాలు కాపాడింది. మోరిస్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సీఈఓ మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లాడు. ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇంట్లో ఉన్న భార్య లారాకు ఫోన్‌ చేశాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే సీఈవో భార్య అక్కడికి చేరుకొని అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది.

డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అందించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. గుండె దమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్‌ కావడంతో ఇలా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు శస్త్రి చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆరురోజుల తర్వాత సీఈవో ఇంటికి చేరుకున్నాడు.

దారుణం, ఏఐ ఉపయోగించి విద్యార్థినుల నగ్న చిత్రాలు తయారు చేసిన స్కూల్ విద్యార్థులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఇటీవల కాలంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి ఎల్టీఈ కనెక్టివిటీ, అలాగే ఈ-సిమ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌లలో ఫోన్‌లు దగ్గరలో లేకునప్పటికీ కాల్‌ చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గతంలో గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయడంతో పలువురి ప్రాణాలు దక్కిన విషయం తెలిసిందే. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్‌, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి.