UPI Lite: యూపీఐ లైట్‌ లిమిట్‌ రూ. 500 పెంపు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుంగా మీరు ఇకపై 500 వరకు పేమెంట్ చేసుకోవచ్చు

డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించిన యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు.

RBI raises UPI Lite transactions limit. (Photo credits: Pixabay)

డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించిన యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నిర్ణయంతో యూపీఐ లైట్‌ ద్వారా రూ.500 వరకు పిన్‌ నమోదు చేయకుండానే సేవలను వాడుకోవచ్చు.

సింగిల్‌ లావాదేవీలో పరిమితి మొత్తాన్ని పెంచినప్పటికీ.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో లోడ్‌ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని రూ.2 వేలకే పరిమితం చేశారు. యూపీఐ లైట్‌ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.

డెల్ కంపెనీలో లేఆప్స్, సేల్స్ టీంను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం

అయితే, టు-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ లేకుండా చెల్లింపుల విషయంలో రిస్కులు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాలెట్‌ పరిమితిని పెంచలేదన్నారు. చెల్లింపుల పరిమితికి సంబంధించిన సూచనలను త్వరలో జారీ చేయనున్నట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు.