The Reserve Bank of India (RBI) |

ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఈ ఒప్పందాలు చేసుకుంటోంది. దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌ (UPI Payment System) సర్వసాధారణ విషయంగా మారింది.

ప్రతి చిన్న లావాదేవీకి యూపీఐ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు దేశంలో మాత్రమే యూపీఐ పేమెంట్స్ జరిగేవి. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా ఉండేది. ఈ నేపథ్యంలో వారి కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది.తొలిసారిగా భారత్‌ , సింగపూర్‌ దేశాల మధ్య ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ల మధ్య ఒప్పందం (India and Singapore sign pact) కుదిరింది.

కీబోర్డులో ALTకీతో సింబల్స్ రప్పించవచ్చు, వివిధ దేశాల కరెన్సీ గుర్తులని ఆల్ట్ కీతో నంబర్లను ఉపయోగించి బయటకు తీసుకురావడం ఎలాగో తెలుసుకోండి

ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు ( instant flow of retail payments ) నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్‌ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది.



సంబంధిత వార్తలు

Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు

Lawrence Wong Sworn: సింగపూర్‌ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గ మార్పులు

Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు ​​జారీ

Lok Sabha Election 2024 Result Prediction: బీజేపీ 400 సీట్ల మార్క్ దాటుతుందా ? కాంగ్రెస్ పుంజుకుంటుందా, ఫలోడి సత్తా మార్కెట్ లేటేస్ట్ అంచనాలు ఇవిగో..

Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ ప‌ర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నిక‌ల సంఘం

What is FLiRT? కొత్త కోవిడ్ FLiRT వేరియంట్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఇవిగో, భారత్‌లో పెరుగుతున్న కొత్త కరోనా వేరియంట్ కేసులు

New COVID-19 Variant ‘FLiRT’: భారత్‌లో కొత్త కరోనా వేరియంట్ FLiRT కలకలం, ఇప్పటివరకు దేశంలో 250 కేసులు నమోదు, కోవిడ్-19 వేరియంట్ ఆందోళనపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

Southwest Monsoon: వానలపై గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ, మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం