QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం
తరచుగా లోకల్ స్టోర్లు, డెలివరీ సర్వీసులు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి ప్రదేశాలలో ఈ క్యూఆర్ కోడ్ మోసాలకు ఎక్కువగా అవకాశం ఉంది.
New Delhi, DEC 18: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) భారత్‌లో ఆన్‌లైన్ లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చింది. సులభతరమైన డబ్బు ట్రాన్స్‌ఫర్, పేమెంట్లను అనుమతిస్తుంది. వివిధ రకాల మోసాలకు కూడా దారితీసింది. క్యూఆర్ కోడ్ స్కామ్‌లు (QR Code Scams).. మోసపూరిత క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేలా స్కామర్‌లు వినియోగదారులను మోసగిస్తున్నారు. ఇది సెకన్లలో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయేలా చేస్తుంది. క్యూఆర్ కోడ్ స్కామ్‌లు ఎలా పని చేస్తాయి? వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యూఆర్ కోడ్‌లు సాధారణంగా పేమెంట్లు చేయడానికి త్వరితంగా సులభమైన మార్గంగా చెప్పవచ్చు. అయితే, స్కామర్‌లకు టూల్‌గా మారాయి. క్యూఆర్ కోడ్ స్కామ్‌లో, బాధితుడికి ఫేక్ లేదా హానికరమైన క్యూఆర్ కోడ్ (QR Code) అందిస్తారు. తరచుగా లోకల్ స్టోర్లు, డెలివరీ సర్వీసులు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి ప్రదేశాలలో ఈ క్యూఆర్ కోడ్ మోసాలకు ఎక్కువగా అవకాశం ఉంది.
ఒక స్కామర్ చట్టబద్ధమైన లావాదేవీకి లింక్ అయినట్టుగా కనిపించే క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేస్తాడు. కానీ, దానికి బదులుగా స్కామర్ అకౌంటుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేలా ప్రేరేపిస్తాడు. బాధితుడు కోడ్‌ని స్కాన్ చేస్తాడు. అది చూసి వినియోగదారులు ప్రొడక్టు లేదా సర్వీసు కోసం చెల్లిస్తున్నారని భావించారు. కానీ, తెలియకుండానే స్కామర్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ అనుమతిస్తారు. క్యూఆర్ కోడ్‌లో ఫేక్ (APK) లింక్ కూడా ఉండవచ్చు. మీ బ్యాంక్ వివరాలు, ఇతర వ్యక్తిగత డేటాకు యాక్సెస్‌ని పొందేలా చేస్తుంది. హానికరమైన యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. కొన్ని సందర్భాల్లో, మీరు క్యూఆర్ కోడ్‌లలో ఉన్న ఫేక్ యూఆర్ఎల్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆటోమాటిక్‌గా మీ డివైజ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు.. క్యూఆర్ కోడ్‌లపై ఆధారపడకుండా నేరుగా రీసీవర్ వెరిఫైడ్ యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం ఉత్తమం. ప్రత్యేకించి మీకు సోర్స్ తెలియకపోతే.. మోసపూరిత లావాదేవీలను హైడ్ చేసేందుకు స్కామర్‌లు తరచుగా క్యూఆర్ కోడ్‌ల ఆధారంగా వినియోగదారులను నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు.
గుర్తుతెలియని ప్రదేశాలలో లేదా అనుమానాస్పదంగా కనిపించే వ్యాపారాలలో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం పట్ల జాగ్రత్తగా ఉండండి. స్కామర్‌లు రెస్టారెంట్‌లు, కియోస్క్‌లు లేదా మార్కెట్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫేక్ క్యూఆర్ కోడ్‌లను సులభంగా ఉంచవచ్చు. పేమెంట్ కొనసాగించే ముందు క్యూఆర్ కోడ్ చట్టబద్ధమైన, విశ్వసనీయ మర్చంట్‌కు చెందినదని నిర్ధారించుకోవాలి.