Vivo T3 5G: వివో నుంచి మరొక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల, రూ. 20 వేల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చేసింది, ఈ కొత్త ఫోన్ ప్రత్యేకలు ఇలా ఉన్నాయి!

Vivo T3 5G (Photo Credits: Official Website)

Vivo T3 5G Smartphone: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తమ T సిరీస్‌ను విస్తరిస్తూ మరొక మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Vivo T3 5G పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ఉండాల్సిన ఫీచర్లు అన్నీ ఉన్నాయి. ఇది వివో కంపెనీ గతంలో విడుదల చేసిన Vivo T2 మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉండనుంది. అందులో ఒకటి 8GB+128GB వేరియంట్‌, దీని ధర రూ. 19,999 ఉండగా, మరొకటి 8GB+256GB మోడల్‌కు రూ. 21,999 ధరను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ Vivo యొక్క తాజా మిడ్-రేంజర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై నడుస్తుంది అలాగే అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G610 MC4 GPUతో జత చేయబడింది. కెమెరా డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడితే, Vivo T3 వెనుకవైపు 50MP Sony IMX882 ప్రైమరీ సెన్సార్‌, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఈ హ్యాండ్‌సెట్ IP54 స్ల్పాష్ , డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది, అంటే ఇది కొన్ని నీటి చుక్కలను తట్టుకోగలదు.

ఇంకా సరికొత్త Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయో ఈ కింద పరిశీలించండి.

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అదనంగా Vivo T3 స్మార్ట్‌ఫోన్‌లో 8 5G బ్యాండ్‌లు, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్ మరియు స్టీరియో స్పీకర్ సెటప్‌ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ మార్చి 27 నుండి vivo ఇండియా ఇ-స్టోర్ మరియు Flipkartలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.