WhatsApp 3D Avatar Feature: ఇకపై వాట్సాప్‌లో మీ యానిమేటెడ్ అవతార్, యూజర్లకోసం ఫేమస్ ఫీచర్ తీసుకువచ్చిన వాట్సాప్, సేమ్ టూ సేమ్ మీ లాగే ఉండే అవతార్‌ను ఎలా క్రియేట్ చేసుకోవచ్చో తెలుసా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు
కంపెనీ ఇప్పటికే అన్ని డివైజ్‌లకు అప్‌డేట్‌ను ప్రారంభించింది. అంటే రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అందరూ చాట్‌లలో మీ అవతార్‌ను స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు.
News Delhi, DEC 08: ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో మరో సరికొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో ఫేమస్ అయిన అవతార్ ఫీచర్ ను వాట్సాప్ లో కూడా తీసుకువస్తుంది. యూజర్లకు వాట్సాప్ లేటెస్ట్‌గా అవతార్‌లను (New 3D Avatar Feature) క్రియేట్ చేసుకోనే అవకాశం కల్పిస్తోంది. యూజర్లు తమ భావోద్వేగాలను, భావాలను తెలియజేసేందుకు అవతార్‌లు సాయపడతాయని ప్లాట్‌ఫారమ్ సూచిస్తోంది. యూజర్లు తమ వాట్సాప్ లో సొంత అవతార్‌ని క్రియేట్ (New 3DAvatar Creation) చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ అందించిన 36 కస్టమ్ స్టిక్కర్‌లలో (Stickers) దేనినైనా ఉపయోగించవచ్చు. యాప్‌లో మరిన్ని స్టైల్స్ యాడ్ చేస్తోంది. ఈ మేరకు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. వీటిలో లైటింగ్, షేడింగ్, హెయిర్ స్టయిల్ టెక్సటర్లు మరిన్ని ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే అన్ని డివైజ్‌లకు అప్‌డేట్‌ను ప్రారంభించింది. అంటే రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అందరూ చాట్‌లలో మీ అవతార్‌ను స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వాట్సాప్ సహా అన్ని యాప్‌లలో మరిన్ని స్టైల్స్ త్వరలో వస్తాయని Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ Facebookలో ప్రకటించారు.
Step -1 : వాట్సాప్ యూజర్ చాట్‌లో అవతార్‌ను (new Avatar feature) షేర్ చేస్తే.. యూజర్లు సెట్టింగ్‌ల సెక్షన్లలో సెర్చ్ చేయడానికి బదులుగా ఫీచర్‌ను యాక్సెస్ చేసేందుకు దానిపై Tap చేయవచ్చు. వాట్సాప్ యాప్ కొత్త ఫీచర్ గురించి అన్ని వివరాలను, మీరు మెసేజింగ్ యాప్ దిగువన ఉన్న గెట్ స్టార్ట్ బటన్‌పై Tap చేయాలి. అప్పుడు మీరు మీ అవతార్ కోసం స్కిన్ టోన్‌ని ఎంచుకునేందుకు ఒక ఆప్షన్ పొందవచ్చు. వాట్సాప్ అవతార్‌ను హెయిర్ స్టైల్, దుస్తులతో పాటు ఇతర వస్తువులతో క్రియేట్ చేసుకోవచ్చు.
Step -2 : మెసేజింగ్ యాప్‌లోని సెట్టింగ్‌ల విభాగంలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. యూజర్లు WhatsAppలో Settings menu > Tap on Avatar > Create Your Avatar మీరు అవతార్‌ని క్రియేట్ చేసేందుకు కొన్ని ఆప్షన్లను పొందవచ్చు. మీరు ఆయా దశలను పూర్తి చేసి, ఆపై “Done” బటన్‌పై Tap చేయండి. అవతార్‌ను క్రియేట్ చేసే ప్రక్రియను పూర్తి చేయండి. మీరు ఏదైనా చాట్‌లోని ఎమోజి సెక్షన్లలో అవతార్ సెక్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్‌లో ఎమోజీలు, GIFలు, స్టిక్కర్‌లను మాత్రమే చూపిస్తుంది. ఇకపై యూజర్లు అవతార్‌లను కూడా షేర్ చేయవచ్చు.