WhatsApp New Features: వాట్సాప్ నుంచి మూడు కొత్త ఫీచర్లు, ఇకపై ఆ మెసేజ్‌లు స్క్రీన్ షాట్ తీయలేరు, సైలెంట్ గా గ్రూపు నుంచి ఎగ్జిట్ కావొచ్చు
అలాగే మనకు కావాలనుకున్నవారికే ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ (WhatsApp New Privacy Features Announced)అందుబాటులోకి తేనుంది
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను (WhatsApp New Features) ప్రవేశపెట్టబోతోంది. దీని ప్రకారం యూజర్ గ్రూపుల నుంచి సైలెంట్ గా బయటకు రావొచ్చు. అలాగే మనకు కావాలనుకున్నవారికే ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ (WhatsApp New Privacy Features Announced)అందుబాటులోకి తేనుంది.
దీంతో పాటుగా ఒకసారి చూసిన వెంటనే డిలీట్ అయిపోయేలా మెసేజీలు పంపడం, అలా పంపిన వ్యూ వన్స్ మెసేజీలను స్క్రీన్ షాట్ తీసుకునే వీలు లేకుండా చేయడం వంటి వాటిని కూడా తీసుకువస్తోంది.గ్రూపుల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్ (Exit Groups Silently)అయ్యే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకు వస్తోంది. అయితే గ్రూపు అడ్మిన్లకు మాత్రం ఈ విషయం తెలుస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.అలాగే అందరికీ కనిపించకుండా ఆఫ్ చేసుకోవడం ఇష్టం లేని వారి కోసం వాట్సాప్ కొత్త సదుపాయాన్ని తెస్తోంది. ఆన్ లైన్ లో ఉన్న విషయం కొందరికే కనిపించేలా, లేదా కొందరికి మాత్రమే కనిపించకుండా ఆఫ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి రానుంది.
ఎవరికైనా ఏదైనా ఒకసారి చూసి డిలీట్ చేసేలా ‘వ్యూ వన్స్’ ఆప్షన్ తో మెసేజీ పంపినప్పుడు వారు ఆ మెసేజీని చదవగానే డిలీట్ అయిపోయే సరికొత్త ఆప్షన్ ను వాట్సాప్ ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. అయితే ఒకసారి చూసి డిలీట్ చేసే మెసేజీలనూ కొందరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ‘వ్యూ వన్స్’ ఆప్షన్ కింద పంపిన మెసేజీలను స్క్రీన్ షాట్ తీసేందుకు వీలు లేకుండా లాకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ తీసుకువస్తోంది.