WhatsApp New Feature: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్, ఇకపై వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావచ్చు, ఫేస్‌బుక్ ఆటోమేటిక్ లాగౌట్
అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ ( WhatsApp New Feature) తీసుకురాబోతుంది.
ఇన్ స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ ( WhatsApp New Feature) తీసుకురాబోతుంది. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ లో లాగిన్ అవ్వడానికి ముందు వాట్సాప్ మరో సెక్యూరిటీని జోడించింది. వాట్సప్ యూజర్లు తమ వాట్సాప్ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు, వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావాలని కొరనుంది.
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ యూజర్లు తమ ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి లాగౌట్ అయ్యినట్లు చాలా మంది యూజర్లు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము లాగౌట్ చేయకపోయిన ఫేస్‌బుక్ నుంచి ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యినట్లు కొందరు ఫేస్‌బుక్ కు పిర్యాదు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. అయితే ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. "జనవరి 22న కాన్ఫిగరేషన్ మార్పు వలన కొంతమంది వారి ఫేస్‌బుక్ ఖాతాల నుంచి లాగౌట్ అయ్యారు.
మేము ఈ సమస్యను కనుగొని పరిష్కరించాము, ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి" అని ఫేస్‌బుక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లాగ్-అవుట్ సమస్యకు ఐఫోన్ ఫేస్‌బుక్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. లాగౌట్ అయిన తర్వాత తిరిగి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు టూ-స్టెప్-వెరిఫికేషన్ వల్ల అథెంటికేషన్ కోడ్స్ వారి మొబైళ్లకు రావడానికి చాలా సమయం పట్టింది అని యూజర్లు వాపోయారు