Newdelhi, Jan 19: బ్యాంకు ఖాతాలకు (Bank Accounts) సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తెరిచే ఖాతాలతోపాటు ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు కూడా నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని కోరింది. నామినీని జోడించని ఖాతాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాంకు ఖాతాకు, ఎఫ్ డీలకు నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించింది.
#MoneyToday | FDs, savings account: RBI issues notification on nomination in FDs, lockers, savings account https://t.co/OnAInjFZyS
— Business Today (@business_today) January 17, 2025
ఎందుకంటే?
ఖాతాలకు నామినీని జోడించకపోవడం వల్ల భవిష్యత్తులో ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉందని, దురదృష్టవశాత్తు డిపాజిట్ దారుడు మరణించినప్పుడు ఖాతాలోని సొమ్మును పొందేందుకు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది.